ఏమి మాట్లాడాతారో ఆ భగవంతుడికి తెలియాలి

ఒకరిపై వ్యాఖ్యలు చేసి హీరోను చేయడం తనకు ఇష్టం ఉండదని, తానే సూపర్‌ హీరోనని అన్నారు సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ. శనివారం హిందూపురంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఓ ప్రైవేటు ఆస్ప్రతిని ప్రారంభించారు. పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో ఎన్టీఆర్‌ ఇండోర్‌ స్టేడియం మరమ్మతుకు రూ.2కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల తెదేపాపైనా, మంత్రి నారాలోకేష్‌పైనా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల గురించి బాలకృష్ణను ప్రశ్నించగా, ఆయన ఆచితూచి స్పందించారు. పవన్‌ వ్యాఖ్యలపై స్పందించి ఆయన్ని హీరో చేయడం తనకు ఇష్టం ఉండదని, తానే సూపర్‌ హీరోనని అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తానన్నారు. మే నాటికి గొల్లపల్లి నుంచి తాగునీటిని హిందూపురం మున్సిపాలిటీకి అందేలా చూస్తామన్నారు. పిల్లల మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని, పీవీసింధు, చాముండేశ్వరీ నాథ్‌లు హిందూపురం వచ్చి విద్యార్థులను ప్రోత్సహిస్తామని తనకు హామీ ఇచ్చారని చెప్పారు. శిథిలావస్థకు చేరిన ఎన్టీఆర్‌ ఇండోర్‌ స్టేడియాన్ని రూ.2కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నట్లు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com