ఏలూరులో ఎస్వీఆర్‌ శతజయంతి

అలనాటి లెజెండరీ విలక్షణ నటుడు ఎస్వీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జులై 3న జరుగనున్నాయి. ఎస్వీఆర్‌ స్వస్థలమైన ఏలూరులో ఎమ్మెల్యే బడేటి కోటరామరావు (బుజ్జి), ఎస్వీరంగారావు కుటుంబీకులు సంయుక్తంగా ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా ఈ ఉత్సవాలు జరుగనున్నట్టు నిర్వహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో వేడుకలకు సంబంధించి ‘మా’ (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌)కు ఆహ్వానం అందింది. ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఏపీ ఎఫ్‌డీసీ చైర్మెన్‌ అంబికా కృష్ణలు శనివారం హైదరాబాద్‌లోని ‘మా’ కార్యాలయానికి విచ్చేసి ‘మా’ బృందానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా సమక్షంలో బడేటి బుజ్జి, అంబికా కృష్ణలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడిద శ్రీరామ్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, బెనర్జీ, నాగినీడు, సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com