ఏసీ దుప్పట్లు రెండు సార్లు ఉతుకుతారు

రైళ్లలోని ఏసీ కోచ్‌లలో దుప్పట్లు చాలా మురికిగా ఉంటున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో రైల్వే నివారణ చర్యలు తీసుకుంటోంది. దుప్పట్లను ఇక మీదట నెలకు రెండు సార్లు ఉతకాలని రైల్వే నిర్ణయించింది. ఇంతకుముందు రెండు నెలలకు ఒకసారి ఉతికేవారు. కాగా ఇప్పుడు నెలకు రెండు సార్లు ఉతకాలని, ఒకవేళ దుప్పట్లు తక్కువగా ఉంటే కనీసం నెలకు ఒకసారైనా ఉతకాలని అధికారులు అన్ని రైల్వే జోన్లను ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు తరచూ ఉతికేందుకు వీలుగా ఉండే కొత్త దుప్పట్లను తీసుకోనున్నారు. ఎక్కువ సార్లు ఉతకడం వల్ల దుప్పట్లు త్వరగా పాడైపోతాయి. కాబట్టి వాటిని రెండేళ్ల వరకు మాత్రమే ఉంచాలని తర్వాత మార్చేయాలని రైల్వే భావిస్తోంది. గతంలో ఒకసారి కొన్న దుప్పట్లను నాలుగేళ్ల వరకు ఉంచేవారు. ఇప్పుడు ఊలు‌, నైలాన్‌లతో కూడిన కొత్త దుప్పట్లను తీసుకోనున్నారు. దీని వల్ల రైల్వేకు దుప్పట్ల కొనుగోలు ధర రెట్టింపు కానుంది. గతంలో ఉన్న ఊలు దుప్పట్లను రూ.400కు కొనుగోలు చేశారు. అయితే కొత్తగా కొనబోయే దుప్పట్లకు ఎంత ధర పెట్టాలో ఇంకా నిర్ణయించలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. విడతల వారీగా రైళ్లలో కొత్త దుప్పట్లను అమర్చనున్నామని చెప్పారు. దుప్పట్లను వాడిన తర్వాత మళ్లీ ప్రయాణికులకు ఇచ్చే ముందు శభ్రపరిచి ఇవ్వాలని రైల్వే నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా రైళ్లలో ప్రయాణించే ఏసీ ప్రయాణికులకు రైల్వేకు ప్రతి రోజూ 3.90 లక్షల దుప్పట్లు అవసరమవుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com