ఏ కాలంలో ఏ పండు?

మనం కాలానుగుణంగా లభించే పండ్లను తింటుంటాం. కానీ ఏ కాలంలో ఏ పండ్లను తింటే శరీరానికి ఎటువంటి ఉపయోగమో తెలుసుకుంటే మంచిది. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవికాలంలో శరీరం నుండి చెమట ద్వారా ఎక్కువగా లవణాల బయటకు విసర్జించబడతాయి. మరలా వాటిని శరీరానికి అందించాలంటే ఏ రకమైన పండ్లను తినాలో తెలుసుకోవాలి. (ప్రతి 100 గ్రా.పండ్లలో…)
****పుచ్చకాయ
దీనిలో నీరు-96 గ్రా, కాల్షియం-11 గ్రా., ఫాస్పరస్-12 మి.గ్రా, ఐరన్-8 మి.గ్రా. ఇది రక్తహీనతను తగ్గించటంలో, సైనసైటిస్ నివారణకు తోడ్పడుతుంది.
****మామిడి
నీరు-31గ్రా. ఖనిజలవణాలు -0.4గ్రా, కార్బొహైడ్రేట్లు-17గ్రా, కాల్షియం-14గ్రా, పాస్పరస్-16 మి.గ్రా. కెరోటిన్- 2743 మై.గ్రా., శక్తి – 74 కేలరీలు, విటమిన్ సి-10 మి.గ్రా ఉంటాయి. ఇది రేచీకటి నివారణకు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు జలుబును ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది.
****నిమ్మ
దీనిలో నీరు-85 గ్రా., కాల్షియం-90 గ్రా. పాస్ఫరస్‌-20 మి.గ్రా., విటమిన్‌ సి-63 మి.గ్రా., శక్తి-59 కేలరీలు ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తి పెంపొందడానికి, జలుబు, స్కర్వీ (విటమిన్‌ సి తగ్గినప్పుడు వచ్చేది) వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది.
****జామ
నీరు- 82 గ్రా.,కార్బొహైడ్రేట్లు-11 గ్రా, కాల్షియం-10 గ్రా., పాస్ఫరస్‌-28 మి.గ్రా, విటమిన్‌ సి-212 మి.గ్రా, శక్తి-51 కేలరీలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను, యూరిక్‌ ఆమ్ల గాఢతను తగ్గించటంలోను తోడ్పడుతుంది. దంతాల్ని పరిరక్షిస్తుంది.
****బొప్పాయి
నీరు -91 గ్రా.,కార్బొహైడ్రేట్లు-8 గ్రా.,కాల్షియం-17 గ్రా., పాస్ఫరస్‌-13 మి.గ్రా, కెరోటిన్‌-666 మై.గ్రా., విటమిన్‌ సి-57 మి.గ్రా, శక్తి-32 కేలరీలు ఉంటాయి. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి, ప్రోటీన్‌లు సులభంగా జీర్ణం కావడానికి, సుఖ విరోచనానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
****కొబ్బరి నీరు
నీరు-94 గ్రా., కాల్షియం-24 గ్రా., పాస్ఫరస్‌-10 మి.గ్రా., కెరోటిన్‌-15 మై.గ్రా., శక్తి-24 కేలరీలు ఉంటాయి. ఎసిడిటి, కలరా, జీర్ణసంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
****చెరకు రసం
నీరు-90 గ్రా., కార్బోహైడ్రేట్లు-10 గ్రా., కాల్షియం-10 గ్రా., పాస్పరస్‌-10 మి.గ్రా., శక్తి-39 కేలరీలు ఉంటాయి. ఎముకల బలానికి రీహైడ్రేషన్‌ ప్రక్రియలో ఉపయోగపడుతుంది.
****బత్తాయి
నీరు-90 గ్రా., కార్బొహైడ్రేట్లు-11 గ్రా., కాల్షియం-26 గ్రా., పాస్ఫరస్‌-20మి.గ్రా., కెరోటిన్‌-1104 మి.గ్రా., విటమిన్‌ సి-30 మి.గ్రా., శక్తి-50 కేలరీలు. ఇది రోగ నిరోధకశక్తి పెరుగుదలకు, కొలెస్ట్రాల్‌ తగ్గించేందుకు, క్యాన్సర్‌ నుండి రక్షణకు తోడ్పడుతుంది.
****సపోట
నీరు-75 గ్రా., కార్బొహైడ్రేట్లు-22 గ్రా., కాల్షియం-28 గ్రా., పాస్ఫరస్‌-27 మి.గ్రా., కెరోటిన్‌-97 మై.గ్రా., పీచు 3గ్రా., విటమిన్‌ సి-6 మి.గ్రా., శక్తి-98 కేలరీలు లభిస్తాయి. ఇది జీర్ణశక్తికి మలబద్ధక నివారణకు, ఎముకల పటిష్టానికి, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
****అరటి
నీరు 70 గ్రా., కార్బొహైడ్రేట్లు-27 గ్రా., కాల్షియం-17 గ్రా., ఫాస్పరస్‌-36 మి.గ్రా., కెరోటిన్‌-78 మె.గ్రా., శక్తి – 116 కేలరీలు లభిస్తాయి. ఇది జీర్ణ సంబంధ వ్యాధులు, మలబద్ధకం, రక్తహీనత, ఆర్థరైటిస్‌ నివారణకు తోడ్పడుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com