ఏ నూనె వాడాలి?

స్థూలకాయం, కొలెస్ట్రాల్, జీర్ణకోశవ్యాధులు, హృద్రోగాలు వంటివన్నీ వంటనూనెలు మితిమీరి వాడటం వల్లే వస్తుంటాయి. అలాగని వాటిని పూర్తిగా మానేసినా మంచిది కాదు. కాబట్టి వంటల్లో రోజూ ఎలాంటి నూనెలు వాడాలి? ఎందుకు వాడాలో తెలుసుకోవాలంటే ఇది చదవండి.
**రైస్బ్రాన్ ఆయిల్
ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువ. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ. సహజసిద్ధమైన విటమిన్-ఇ లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. చర్మకాంతిని మెరుగుపరిచే పోషకాలు రైస్బ్రాన్‌లో ఉంటాయి. ఈ నూనెతో ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతుంది.
**ఆలివ్ ఆయిల్
అల్జీమర్స్, పార్కిన్‌సన్ వంటి నాడీమండల వ్యాధుల్ని రాకుండా కాపాడుతుంది. ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది.
**సన్ఫ్లవర్ నూనె
పొద్దుతిరుగుడు గింజల నూనె వాడకం శ్రేయస్కరం. ముఖ్యంగా హృద్రోగసంబంధిత జబ్బుల్ని రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఈ నూనెలోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. కొలోన్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుందీ నూనె. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నాడీమండల వ్యవస్థను చురుగ్గా మార్చివేస్తుంది.
**వేరుశనగ నూనె
శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇచ్చే నూనె ఇది. మోనో శాచురేటెడ్, పోలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికం. హృద్రోగాలు, క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడే ఒమెగా-3 ప్యాటీ ఆసిడ్స్ కూడా వేరుశనగ నూనెలో ఉన్నాయి. అయితే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు పొగ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
**ఆవనూనె
జీర్ణశక్తిని పెంపొందించే గుణం అధికం. ఉదరంలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియా, వైరస్‌ను అడ్డుకుంటుంది ఆవనూనె. దగ్గు, జలుబులతో పాటు చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారం అందిస్తుంది. ఈ నూనె వాడకం వల్ల కడుపులో మంట కూడా తగ్గుతుంది.
**బాదం నూనె
ఈ నూనె ముఖ్యంగా రెండు సమస్యలను తగ్గిస్తుంది. ఒకటి గుండెజబ్బు, రెండు క్యాన్సర్. మంచి కొవ్వును పెంచుతుంది. అప్పుడప్పుడు కడుపులో తలెత్తే గందరగోళం (ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్) రాకుండా చూస్తుంది. కొలోన్ క్యాన్సర్ రానివ్వదు.
**కొబ్బరినూనె
చెడు బ్యాక్టీరియాను తరిమేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందించి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కొబ్బరినూనె వాడకంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
**పామ్ ఆయిల్
కెరొటిన్, విటమిన్-ఇలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పామ్ ఆయిల్‌లో ఉంటాయి. వయసును తగ్గించే గుణాలు కూడా ఇందులో ఎక్కువ. క్యాన్సర్, అల్జీమర్స్, ఆర్థరైటిస్ బాధితులకు పామ్ ఆయిల్ మంచిది. అయితే మోతాదుకు మించి వాడకూడదు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com