ఐకియా వ్యవస్థాపకుడు మృతి. ఒకనాడు అగ్గిపుల్లలు అమ్మారు.

ప్రపంచలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరైన ఐకియా వ్యవస్థాపకుడు ఇన్గ్వర్‌ కాంప్రాడ్‌ (91)కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వీడన్‌కు చెందిన ఐకియా అధికారికంగా ప్రకటించింది. స్మాలాండ్‌లోని ఆయన స్వగృహంలో కాంప్రాడ్‌ తుదిశ్వాస విడిచారు. 20వ శతాబ్దంలో‌ అత్యంత విజయవంతమైన వ్యాపార వేత్తల్లో కాంప్రాడ్ ఒకరు. ఆయన స్థాపించిన ఐకియా సంస్థ ఫర్నిచర్‌ తయారీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. 1926లో స్వీడన్‌లోని స్మాలాండ్‌ అనే కొండ ప్రాంతంలో జన్మించారు. ఆయన ఆరేళ్ల వయస్సులోనే అగ్గిపుల్లలు విక్రయించారు. పదేళ్ల వయస్సులో సైకిల్‌పై తిరిగి క్రిస్మస్‌ అలంకరణలు, పెన్సిళ్లు విక్రయించారు. 17ఏళ్ల వయస్సలో బహుమతిగా వచ్చిన సొమ్ముతో ఐకియా అనే ఫర్నిచర్‌ విక్రయించే సంస్థను స్థాపించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com