ఐదేళ్లు ఆయనే

రిలయన్స్‌ సంస్థకు మరో ఐదేళ్లు పాటు ముకేశ్‌ అంబానీనే ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఇందుకు ఆ కంపెనీ వాటాదారులు అంగీకారం తెలిపారు. ముకేశ్‌ అంబానీ తండ్రి చనిపోయినప్పటి నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఆయనే ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఛైర్మన్‌గా ఆయన పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన కంపెనీ 41వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ముకేశ్‌ ఛైర్మన్‌గా కొనసాగేందుకు సమ్మతి తెలుపుతూ ప్రతిపాదన పెట్టారు. ఇందుకు 98.5శాతం ఓట్లు ముకేశ్‌కు అనుకూలంగా పడగా, 1.48శాతం ఓట్లు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. కంపెనీ నికర ఆదాయాన్ని బట్టి బోనస్‌ పొందేందుకు ఆయన అర్హులు. ముకేశ్‌ వరుసగా పదేళ్ల నుంచి రూ.15కోట్లను తన వార్షిక వేతనంగా పొందుతున్నారు. 2009లో ఆయన తన వార్షిక వేతనంపై స్వచ్ఛందంగా పరిమితి విధించుకున్నారు. ఈ పరిమితి గత తొమ్మిదేళ్లు‌లుగా కొనసాగుతోంది. అంబానీ వార్షిక వేతనం రూ.38.75కోట్లుగా ప్రతిపాదించినప్పటికీ.. ఆయన పరిమితి విధించుకోవడంతో రూ.15కోట్లే వేతనంగా తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో జియోఫోన్‌ 2ను ఆవిష్కరించారు. దీంతో పాటు బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల్లోకి రిలయన్స్‌ అడుగుపెడుతున్నట్లు ముకేశ్‌ ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి జియో గిగా ఫైబర్‌ దేశవ్యాప్తంగా 1100 నగరాల్లో అందుబాటులోకి రానుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com