ఐసీఐసీఐ విచారణ ప్రారంభం

వీడియోకాన్‌ రుణాల వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో వాటిని కొట్టిపారేసిన బ్యాంకు.. తాజాగా వాటిపై విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. చందాకొచ్చర్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా ఐసీఐసీఐ పేర్కొంది. వీడియోకాన్‌ సంస్థకు రూ. 3,250కోట్ల రుణ వ్యవహారంలో చందాకొచ్చర్‌ సాయం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2012లో వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ రుణం ఇచ్చింది. వీడియోకాన్‌ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌, మరో ఇద్దరు బంధవులు కలిసి 2008లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. ఐసీఐసీఐ ఇచ్చిన రుణంలో రూ.2,810 కోట్లు (దాదాపు 86 శాతం)ను వీడియోకాన్‌ తిరిగి చెల్లించలేకపోయింది. 2017లో ఇది మొండి బకాయిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌కు కొచ్చర్‌ రుణాలిచ్చేందుకు తోడ్పాటు అందించారని, ఫలితంగా ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇందులో చందాకొచ్చర్‌ ప్రమేయం ఏమీ లేదని అప్పట్లో ఐసీఐసీఐ బోర్డు చెప్పింది. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని, చందాకొచ్చర్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. చందాకొచ్చర్ భర్త దీపక్‌, వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌లను అనుమానితులుగా చేర్చింది. ఇప్పటికే వారిని విచారిస్తోంది. తాజాగా చందాకొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై కూడా విచారిస్తామని ఐసీఐసీఐ స్పష్టం చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com