ఒకసారి సరదాతో మొదలయి క్యాన్సర్ వరకు వెళ్తుంది. జాగ్రత్త.

సిగరెట్‌ ఒక్కటైనా చేసేచేటు తక్కువేమీకాదని తాజా అధ్యయనంలో తేలింది. సరదాగా ఒకసారి దీన్ని తాగుదామని భావించినవారిలో 61 శాతం మంది పొగరాయుళ్లుగా మారుతున్నారని వెలుగులోకి వచ్చింది. లండన్‌లోని క్వీన్‌మేరీ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లకు చెందిన 2,15,000 మంది సమాచారాన్ని వారు విశ్లేషించారు. ‘ఓ వ్యసనానికి బానిస కావడంలో ‘‘తొలి సరదా’’లు ప్రముఖ పాత్రపోషిస్తాయి. సిగరెట్‌ విషయంలో ఈ ముప్పు విపరీతంగా ఉంటోంది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఇలానే పొగకు బానిసలు అవుతున్నారు. దీంతో అసలు సిగరెట్‌ జోలికి వెళ్లకుండాచూస్తే మంచి ప్రయోజనాలుంటాయి’అని పరిశోధనకు నేతృత్వం వహించిన పీర్‌ హెజెక్‌ తెలిపారు. గత 20ఏళ్లలో కొత్తగా పొగరాయుళ్లుగా మారుతున్నవారి సంఖ్య తగ్గడానికి.. ఒక్కసారి కూడా సిగరెట్‌ జోలికి వెళ్లకపోవడమే ప్రధాన కారణమని వివరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com