“ఒక్కసారి చెప్తే…” డైలాగ్ రచయిత మృతి

ప్రముఖ రచయిత బాలకుమారన్‌ మంగళవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు. బాలకుమారన్‌ అనేక విజయవంతమైన సినిమాల కోసం పనిచేశారు. ‘బాషా’, ‘‘కాదలన్‌’, ‘నాయకన్‌‌’, ‘జెంటిల్‌మెన్‌’, ‘సిటిజెన్‌’ తదితర సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. ‘ఈ బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టే’ డైలాగ్‌ను కూడా బాలకుమారన్‌ రాశారు. ఈ డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం విడుదలై దాదాపు 23 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా అందరి నోళ్లల్లో నానుతోంది. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ మంగళవారం బాలకుమారన్‌ ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజనీ మీడియాతో మాట్లాడుతూ.. ‘బాలకుమారన్‌ నా ఆప్తమిత్రుడు. ఆయన మృతి తీరని లోటు. ‘బాషా’ సినిమా పెద్ద విజయం సాధించడానికి ఆయన రాసిన డైలాగ్‌లే కారణం. ‌నా సినిమాల కోసం ఆయన్ను తీసుకోవడానికి ప్రయత్నించా. కానీ, అందుకు ఆయన ఒప్పుకోలేదు, కుదరదని చెప్పారు. తన దృష్టిని సాహిత్యం, ఆధ్యాత్మికతపై పెట్టినట్లు తెలిపారు’ అని రజనీ పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com