ఒక మూడు సార్లు శృంగారం. సర్వ ఆనంద కారకం.

చాలామంది శృంగారం అంటే పడక సౌఖ్యం కోసమే అనుకుంటారు. కానీ దానివల్ల ఆరోగ్యానికీ బోలెడు ప్రయోజనాలు అంటున్నారు నిపుణులు.
కరిగిపోతాయి క్యాలరీలు: ట్రెడ్‌మిల్‌మీద 40 నిమిషాలపాటు చేసే వాకింగ్‌, లేదా యోగా చేయడం వల్ల కరిగే క్యాలరీలకన్నా 30 నిమిషాల శృంగారం కారణంగా అధిక క్యాలరీలు ఖర్చవుతాయట. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి దీన్ని మించిన వ్యాయామం లేదట.
ఆనందం: శృంగారం కారణంగా ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి ఆనందంగా ఉంటారు. అదేసమయంలో సంతానసాఫల్యత పెరుగుతుంది. రోగనిరోధకశక్తీ వృద్ధి చెందుతుంది. దీనివల్ల విడుదలైన ఆక్సీటోసిన్‌ కారణంగా తలనొప్పి, మైగ్రెయిన్‌, కీళ్లనొప్పుల బాధలు తగ్గుతాయి.
ఎముకలకీ బలం: మెనోపాజ్‌ సమయంలో ఈస్ట్రోజెన్‌ స్థాయిలు పడిపోవడం కారణంగా చాలామంది మహిళలు ఆస్టియోపొరోసిస్‌ బారిన పడుతుంటారు. అయితే వారంలో కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మిగిలినవాళ్ల శాతంకన్నా రెట్టింపు ఉంటుంది. దాంతో ఎముక ఆరోగ్యం క్షీణించదు. వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో పక్షవాతం, గుండెజబ్బులు కూడా రావట. యోనిగోడలు సైతం పొడిబారకుండా తేమగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
బంధం పదిలం: భార్యాభర్తల మధ్య శృంగారం అనేది శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక అనుబంధం బలపడ్డానికీ కారణమవుతుంది. పైగా రోజూ శృంగారంలో పాల్గొనే మహిళల్లో కటిభాగంలో కండరాలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. దాంతో గర్భాశయం జారిపోకుండా ఉంటుంది. మూత్రనాళ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి.
ముఖానికీ అందం: వారానికి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళలకు ప్రత్యేకించి ఫేసుక్రీములతో పనిలేదని ఓ అధ్యయనంలో తేలింది. వీళ్లు అసలు వయసు కన్నా ఏడెనిమిదేళ్లు చిన్నగా కనిపిస్తారట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com