ఒబామా ఈజ్ బెస్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు శ్వేతసౌధంలో ఇప్పుడు కొలువు లేకపోవచ్చు. కానీ, అత్యధికమంది ప్రజల హృదయాల్లో కొలువు సంపాదించారాయన! తమ జీవితకాలంలో చూసిన అత్యుత్తమ అధ్యక్షుడు ఆయనేనని 44% మంది అమెరికన్లు వెల్లడించడం విశేషం. అదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్యూ పరిశోధన కేంద్రం (పీఆర్‌సీ)’ ఇటీవల చేపట్టిన తాజా సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గతనెల 5-12 తేదీల నడుమ నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 2,002 మంది వయోజనులు పాల్గొన్నారు. మొదటి, రెండో ప్రాధాన్య ఓట్ల రూపంలో వారి అభిప్రాయాలను సేకరించారు.రెండు పర్యాయాలు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ఒబామాకు సర్వేలో పాల్గొన్నవారిలో 44% మంది, బిల్‌ క్లింటన్‌కు 33% మంది, రోనాల్డ్‌ రీగన్‌కు 32% మంది అత్యుత్తమ అధ్యక్షునిగా ఓటు వేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com