ఓరుగల్లు కోటపై తెరాస పాగా

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన విజయం సాధించారు. గతంలోని సీఎం కేసీఆర్, డిప్యూటీ కడియం శ్రీహరి రికార్డును పసునూరి బ్రేక్ చేశారు. 4,59,092 ఓట్ల భారీ మెజార్టీతో పసునూరి గెలుపొందారు. ఉప ఎన్నికలో పసునూరి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీఆర్‌ఎస్ ఏకపక్షంగా గెలిస్తే.. ప్రతిపక్షాలు బంగాళాఖాతంలో కలిసిపోయాయి. తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అన్ని సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్సే అత్యధిక మెజార్టీతో దూసుకుపోయింది. టీఆర్‌ఎస్ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. పటాకులు పేల్చుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 1,56,315 ఓట్లు, బీజేపీ 1,30,178 ఓట్లు పోలయ్యాయి. అయితే డిపాజిట్లు దక్కాలంటే లక్షా 73 వేల ఓట్లు రావాలి. బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీ పడ్డాయి తప్ప.. కానీ కనీస పోటీని కూడా ఇవ్వలేదు. ఇక టీఆర్‌ఎస్‌కు 6,15,403 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,52,092 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు 60 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 15 శాతం, బీజేపీకి 12 శాతం ఓట్లు పోలయ్యాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com