కంగారు దేనికి?

‘హాలీవుడ్‌లో నా తొలి చిత్రం విడుదల కాబోతోంది. అది తలచుకుంటే ఎంత ఆనందంగా ఉందో అంతే కంగారుగానూ ఉంద’’టోంది దీపికా పదుకొణె. బాలీవుడ్‌లో నిరూపించుకొని హాలీవుడ్‌లో అడుగుపెట్టింది దీపిక. ఆమె తొలి హాలీవుడ్‌ చిత్రం ‘ట్రిప్లెక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది దీపిక. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ ‘‘మన దేశం నుంచి ఓ హలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది. అందులోనూ ‘ట్రిప్లెక్స్‌..’లాంటి యాక్షన్‌ చిత్రం అనేసరికి మరీ ప్రత్యేకంగా ఉంది. ఈ సినిమా కథ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇంతకు ముందు భారతీయ చిత్రాల్లో చూడని యాక్షన్‌, సాహస దృశ్యాలు ఈ చిత్రంలో ఉంటాయ’’ని చెప్పింది. ఈ చిత్రం ముందుగా ఇండియాలోనే విడుదలవుతోంది. ‘‘ట్రిప్లెక్స్‌…’ చిత్రీకరణలో ఉండగానే ‘మొదట మా దేశంలో విడుదల చేస్తే చాలా బాగుంటుంది’ అని చిత్రబృందానికి సలహా ఇచ్చాను. ఇప్పుడు అదే నిజమైనందుకు సంతోషంగా ఉంద’’ని చెప్పింది దీపిక.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com