కత్తిపోట్లు నిజమైతే ఆనందం

సోషల్‌మీడియాలో వైరలవుతున్న ఓ వీడియో చూసి విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇద్దరు బాలురు నుదుటిపై బూడిద రాసుకుని కమల్‌ పోసర్టను కత్తితో గుచ్చుతూ ఆ వీడియోలో కన్పించారు. ఆ వీడియో కమల్‌హాసన్‌ కంటపడటంతో ఆయన ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఈ వీడియో చూడటం కంటే ఆ బాలుర చేతుల్లో చావడం మంచిదని పేర్కొన్నారు. ఇటీవల కమల్‌ హిందూ ఉగ్రవాదం అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కొందరు వ్యక్తులు ఇద్దరు పిల్లల చేతికి కత్తికి ఇచ్చి కమల్‌ పోస్టర్లపై పొడవండి అంటూ అరవడం ఆ వీడియోలో రికార్డ్‌ అయింది. ‘ఈ ప్రకృతి నన్ను ఎటూ చంపేస్తుంది. కానీ దాని కంటే ముందే నన్ను చంపే హక్కు మీకే ఉంది. నన్ను చంపడానికి ప్రయత్నించండి. నేను తప్పకుండా గెలుస్తాను.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు కమల్‌ వ్యాఖ్యలకు ఖుష్బూ, ప్రకాశ్‌రాజ్‌ తదితర సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com