కథ సుఖాంతం కావాలి

పుష్కరాలు చివరి ఘట్టానికి చేరుకున్నందున.. ఇప్పటి వరకు వచ్చిన మంచి పేరు నిలబెట్టుకోవాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా పుష్కరాల 11వ రోజు ఏర్పాట్లపై సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పుష్కరాలలో ఈ 11 రోజులు ఎంతో కష్టపడ్డారని… అందరికీ అభినందనలు తెలిపారు. బస్టాండ్‌ పుష్కరనగర్‌ వద్ద ఆదివారం ఒక్కరోజే 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2లక్షల మందికి అన్నదానం చేయడం రికార్డు అని.. గిన్నిస్‌బుక్‌కు పంపాలని సూచించారు. కోట్లాది యాత్రికులు తరలివచ్చిన కృష్ణా పుష్కరాలలో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌పై కూడా గిన్నిస్‌బుక్‌కు పంపాలని సూచించారు. పుష్కరాలలో అద్భుతమైన సేవలందించిన వారందరికీ ఈనెల 24న అభినందన సమావేశంలో సత్కరించాలని తెలిపారు. ‘కృష్ణమ్మ పవిత్ర హారతి’ కార్యక్రమానికి మంగళవారం ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తారు కాబట్టి.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com