కరీంనగర్ నుండి పవన్ రాజకీయ యాత్ర

ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. తన రాజకీయ యాత్రను జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించనున్నట్టు పవన్‌ కల్యాణ్‌ శనివారం రాత్రి ప్రకటించారు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి తాను ఇక్కడే బయటపడటం, తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడంతో తన రాజకీయ అప్రతిహత యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. సర్వమత ప్రార్ధనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం బయల్దేరనున్నారు. ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటిని అవగాహన చేసుకొనేందుకు ఈ యాత్ర ద్వారా వస్తోన్న తనను ఆశీర్వదించాలని పవన్‌ కోరారు. తన రాజకీయ యాత్ర వివరాలను, ప్రణాళికలను కొండగట్టులోనే ప్రకటించనున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో పాటు పవన్‌ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com