కరెంటు ఇలా ఆదా

కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు కొన్నామని ఆనందించడమే కాదు దాని నిర్వహణను చూసుకోవడం మరింత ముఖ్యం. నెలవారీగా వస్తున్న ఖర్చుల్లో ప్రధానమైన కరెంట్ బిల్లును తగ్గించుకోవటానికి ప్రయ త్నించాలి. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
*వేడినీటి కోసం గీజర్లకు ప్రత్యామ్నాయంగా సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, విద్యుత్ ఖర్చు కూడా తగ్గుతుంది.
*మనం ఇంట్లో ఉన్నప్పుడు అవసరాలకనుగుణంగా మాత్రమే లైట్లు స్విచ్ ఆన్ చేసుకోవాలి. మళ్లీ ఇంటి నుంచి బయటికి వెళ్లేముందు స్విచ్‌లన్నీ ఆఫ్ వున్నాయా లేదా చూసుకోవాలి.
*రాత్రి పడుకునే ముందు లైట్లన్నీ ఆఫ్ చేసుకొని, అవసరమైన బెడ్ లైట్‌ను వినియోగించుకుంటే సరిపోతుంది.
*ఎండాకాలంలో విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఇంట్లో ఫ్యాన్లు, ఎసిలు పెట్టుకొని ఉండకుండా తీరిక సమయంలో ఇంట్లో ఉన్న చెట్ల కిందికి వెళ్లి సేద తీరితే ఆరోగ్యానికి కూడా మంచిది.
*కుదిరితే ఇంట్లో గదికి మధ్య ఇంటీరియర్ విండోలను ఏర్పాటు చేయాలి. వీటివల్ల సహజ వెలుతురు ఎక్కువగా రావడమే కాదు. ఎసి వాడకాన్ని తగ్గించుకోవచ్చు.
*ఇంట్లో సాధారణ బలులను తొలగిస్తే మంచిది. వీటివల్ల అధిక విద్యుత్తును వినియోగించుకోవడమే కాకుండా… పర్యావరణానికి హాని చేస్తాయి. అందుకే వీటిస్థానంలో ఎల్‌ఇడీలు లేదంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైట్లు వాడాలి.
*పిల్లలకు ఖర్చు విలువ తెలియదు. కాబట్టి విద్యుత్ ఎలా వాడాలో తెలిసేలా వారిలో అవగాహన కల్పిస్తే మరీ మంచిది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com