కర్నూలు జిల్లాలో ఆసక్తికరమైన ప్రాచీన వస్తువులు

కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లికోటలో బంగారం, వజ్రాల నిక్షేపాల కోసం తవ్వకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణదేవరాయుల కాలం నాటి చెన్నంపల్లి కోటలో వజ్రాలు, బంగారం పెద్దఎత్తున ఉందంటూ ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామ అభివృద్ధి కమిటీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గత 20 రోజులక్రితం ముమ్మరంగా తవ్వకాలు జరగ్గా ఏనుగు దంతాలు, జంతు కళేబరాల అవశేషాలు లభ్యమయ్యాయి. అనంతరం కొద్దిరోజుల విరామం అనంతరం మంగళవారం మళ్లీ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కోటబురుజు ప్రాంతంలో రెండు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినప్పటికీ బంగారం బయటపడకపోవడంతో మరో ప్రాంతంలో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. అలాగే పాతాళగంగ బావిలో కూడా తవ్వకాలు కొనసాగుతుండగా మూడు తలల నాగపడగ, ప్రాచీన కాలంనాటి వస్తువులు బయటపడ్డాయి. ఇదిలా ఉండగా ఈ తవ్వకాల వల్ల కోట బురుజుకు ప్రమాదమంటుందని స్థానికులు తెలుపుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com