కర్నూలు తెదేపాలో కీచులాటలు….అడ్డం తిరుగుతున్నఅఖిలప్రియ

కర్నూలు జిల్లా తెదేపా నేతల పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న వివాదం పై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న అఖిల ప్రియ బదులు వచ్చే ఎన్నికల్లో తనకు ఆ టికెట్ ఇవ్వాలని ఏవీ పట్టుబడుతున్నారు. ఇద్దరిని పిలిపించి మాట్లాడినా సమస్య కొలిక్కి రాకపోవడంతో మరోసారి చర్చించారు,. చర్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో తెదేపా న్మేతల మధ్య ఆధిపత్య పోరు రగులుతూనే ఉంది. భూమా, ఏవీ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటోంది. భూమా ప్రాణ స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిని మంటి అఖిల ప్రియ దూరం పెట్టద్మతో ఏవీ ఆళ్లగడ్డ పావు పోకస్ పెట్టారు. దివంగత నేతలు భూమా శోభా నాగిరెడ్డి దంపతులు.. నంద్యాల.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యెక ముద్ర వేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత ఆమె కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే నంద్యాల అభివృద్దిని కాంక్షిస్తూ భూమా నాగిరెడ్డి , కుమార్తె అఖిల ఇద్దరూ వైకాపాని వీడి తెదేపాలో చేరారు. తరువాత హటాత్తుగా మరణించారు. దీంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి అప్పటి వరకు భూమాకు అన్నీ విధాలుగా అండగా ఉన్న ఆయన ప్రాణ స్నేహితుడు ఏవీ. సుబ్బారెడ్డి భూమా పిల్లాలు దూరం పెట్టారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మంత్రి అఖిల తీరుతో ఏవీ వర్గం అసంతృప్తి గురైంది. పార్టీ గెలుపు కోసం విభేదాలు పక్కన పెట్టాలని అధినేత చంద్రబాబు ఇద్దరికి క్లాస్ తీసుకున్నారు. ఏవీ సుబ్బారెడ్డి కూడా.. భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం కృషి చేసారు. ఎయితే ఎన్నికల తరువాత కూడా అఖిల ప్రియ ఎవీని కలుపుకొని పోలేదు.. ఇటీవలే ఆల్లగాద్దలో భూమా ప్రధమ వర్దంతి జరిగితే అఖిల ఎవీని పిలవలేదు. దీనిపై ఏవీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అఖిల మీద అనుచరులు, కార్యకర్తలు మద్దతుదారులతో ఏవీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసారు. ఇద్దరి మధ్య రేగుతున్న వివాదానికి చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే బ్రహ్మందరేద్ది ఏవీ సుబ్బారెడ్డి ణి పిలిచి మాట్లాడారు. ఆళ్లగడ్డ స్థానం తనకు కేటాయించాలని బాబును కోరారు ఏవీ, భూమా కుటుంబానికి తానూ చేసిన సేవను గుర్తు చేసారు. అయితే ఇద్దరూ విభేదాలు పక్కన పెట్టి పార్టీ పటిస్థత కోసం పని చేయాలని బాబు సూచించారు. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో మరోసారి చర్చిస్తానని చెప్పారు. మొత్తానికి భూమా , ఏవీ వర్గాల విభేదాలతో నంద్యాల, ఆళ్లగడ్డలో తెదేపా భవిష్యత్ తెదేపా భవిష్యత్ పై సందేహాలు మొదలయ్యాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com