కలబంద రసం చాలా మంచి పానీయం

*కలబంద రసం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు*
.
అలోవెర (కలబంద) సాధారణంగా దీనిని గార్డెన్లో అందం కోసమే పెంచుతుంటారు. క్రొత్తగా కట్టిన ఇళ్లకూ, భవంతులకూ కూడ దీన్ని దృష్టి దోషనివారణకోసం కడుతుంటారు.
.
ఒక చిన్నమొక్కను తెచ్చి పెరట్లో నాటి అప్పుడప్పుడు కొంచెం నీళ్లు పోస్తుంటే చాలు. ఈ మొక్క ఎన్నో సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది. వేర్ల నుంచే మళ్లీ దీనికి మొక్కలు వస్తాయి. దీనిని ఇంగ్లీషులో అలోవేరా అంటారు.
.
కలబంద రసం వాడకం వలన కలిగే ప్రయోజానాలు అందరికి తెలిసినవే. కలబంద రసం వలన కలిగే ప్రయోజనాలపై ఇప్పటికే చాలా మంది అవగాహన కలిగి ఉన్నారు.
.
కలబందలో ఉండే పోషకాలు, శరీరంలో ప్రమాదాలను మరమ్మత్తులను చేస్తాయి. మన శరీరం అస్వస్తతకు గురైనపుడు నయం చెయటానికి కావాల్సిన పోషకాలు అన్ని కలబంద రసంలో ఉంటాయి. అంతేకాకుండా చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వీటిలో కొన్ని రకాల ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.
.
జీర్ణక్రియ సమస్యలు
.
మనం తినే ఆహరంలో ఉన్న పోషకాలను అన్నిటిని శరీరంలో గ్రహించుకోవాలి అనుకుంటే మాత్రం జీర్ణక్రియలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. జీర్ణాశయ సమస్యలు కలిగి ఉన్న వారు కలబంద రసం తీసుకోవటం వలన ప్రోటీన్ గ్రహించే ప్రక్రియ అధికమయి, పేగు కదలికలు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా, జీర్ణ వ్యవస్థలో ఉన్న వివిధ రకాల బ్యాక్టీరియా మరియు హానికర కారకాలను భయటకి పంపి వేస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించటమే కాకుండా గుండెమంటలను కూడా తగ్గించేస్తుంది.
.
నిరోధక వ్యవస్థలో పెరుగుదల
.
కలబంద రసం యాంటీ-ఆక్సిడెంట్’లను కలిగి ఉండటం వలన శరీరంలో చేరే హానికర కారకాలకు వ్యతిరేఖంగా పోరాడుతుంది. శరీరంలో చేరే ఫ్రీ-రాడికల్స్ అస్థిరమైనవి కావున జీవక్రియలో దుష్ప్రభావాలను చూపటం, వయసు మీరిన వారిలా కనపడేలా మరియు వివిధ రకాలుగా ఇబ్బందులను కలుగ చేస్తాయి. కావున క్రమంగా కలబంద రసం తాగటం వలన మీ శరీరంలో చేరిన ఫ్రీ-రాడికల్’లకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, శరీర రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి.
.
హృదయనాళ వ్యవస్థ
.
కొన్ని పరిశోధనలలో, వైద్యులు కలబంద రసాన్ని రక్తనాళాల ద్వారా రక్తంలోకి ప్రవేశపెట్టడం వలన గణనీయంగా ఎర్ర రక్త కణాల విస్తరణ సామర్థ్యం అధికం అవుతుంది. ఫలితంగా, ఎర్రరక్త కణాలు ఆక్సిజన్ రవాణా చేసే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా, కలబంద రసంలో రక్త పీడనాన్ని నియంత్రించే కారకాలు ఉండటం వలన, రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం పెరుగుతుంది మరియు శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
.
చర్మ సంరక్షణకు
.
చర్మ సంరక్షణకు అవసరమైన అమెనో ఆసిడ్స్ మెండుగా కలిగి, విటమిన్ బి12, విటమిన్ సి, ఇ కాల్షియం, ఐరన్(ఇనుము) లెసిథిన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చర్మం ఎరుపెక్కడం, రేడియేషన్ మూలంగా దెబ్బతిన్న చర్మానికి అలొవెరా జెల్ బాగా పనిచేస్తుంది. స్కిన్ రాషెస్, హెర్పిస్ సింప్లెక్స్, మొటిమలు, రింగ్ వార్మ్ తదితర చర్మవ్యాధులకు కలబంద మంచి ఔషధం. చర్మంపై వచ్చే నల్లమచ్చలను ఇది పోగొడుతుంది. సోరియాసిస్ గజ్జిలాంటి చర్మవ్యాధులను తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది
.కలబంద రసం, కొల్లాజన్ మరియు ఎలాస్టిన్’లను మరమ్మత్తు చేసి చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది. వేస్తుంది. , చర్మంపై ఏర్పడిన తెగుళ్లను, దురదలను మరియు మంటలను తగ్గించి వేస్తుంది.
.
బరువు నిర్వహణ మరియు శక్తి నిర్వహణ
.
కలబంద రసం తాగినపుడు, సహజంగా శరీరం జీర్ణక్రియ వ్యవస్థను శుభ్రపరచుకుంటుంది. ఎందుకనగా మన ఆహరంలో చాలా రకాల భాగాలు ఉంటాయి ఫలితంగా ఆయాసం మరియు అలసట కలిగే అవకాశం ఉంది. కానీ క్రమంగా, కలబంద రసంను తీసుకోవటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. అనగా శరీర క్రియలను సరైన స్థాయిలో నిర్వహించటమే కాకుండా, బరువు నియంత్రణలో పాల్గొని, శక్తి స్థాయిలను పెంచుతుంది.
.
దంతాల ఆరోగ్యం
.
కలబంద రసం చిగుళ్ళు మరియు నోటిలో కలిగే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ రసం ‘యాంటీ-మైక్రోబియల్’ గుణాలను మాత్రమె కాకుండా, ‘యాంటీ-బ్యాక్టీరియల్’ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, విటమిన్ మరియు మినరల్’లను కలిగి ఉండి, కణాల పెరుగుదలను మరియు మరమ్మత్తులను చేస్తుంది. ముఖ్యంగా నోటి అల్సర్ లేదా చిగుళ్ళ నుండి రక్త స్రావం జరిగినపుడు శుభ్రమైన కలబంద రసం వాడమని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తుంటారు. దంత సమస్యలను నివారిస్తుంది
. అలోవెరా జ్యూస్ ను మౌత్ వాష్ గా కూడా తీసుకోవచ్చు . మరియు ఇది దంతాలు, చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ భారీన పడకుండా సహాయపడుతుంది. దంతక్షయాన్నిదూరం చేస్తుంది.
.
అమైనో ఆసిడ్’ల రవాణా
.
సాధారణంగా మన శరీరంలో ప్రోటీన్’ల నిర్మాణానికి భిన్న రకాల 20 అమైనో ఆసిడ్’లు అవసరం . ఇందులో కావలసిన 8 రకాలు మన శరీరంలో ఉత్పత్తి చెందవు. కావలసిన 8 రకాలలోని 7 రకాల అమైనో ఆసిడ్’లు కలబంద రసం నుండి పొందవచ్చు. మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను

*అలూవేరా జ్యూస్ – ఉపయోగాలు*
.
1. డయాబెటిస్ ను నియంత్రణలోకి తేవడం
2. నపుంసకత ను పోగొట్టడం
3. శరీరంపై మచ్చలు , మొటిమలు
4. జుట్టు సమస్యలు అన్నీ , చుండ్రు
5. గాంగ్రీన్ ను నయం చెయ్యగల ఏకైక ఔషధం
( పది రోజులలో )
6. సోరియాసిస్ , ఎక్జిమా వంటి చర్మ వ్యాధులు
7. రక్తం లో ఎసిడిటీ ని తగ్గిస్తుంది
8. అల్సర్లు తగ్గుతాయి
9. చెవిపోటు అయిదు నిముషాలలో తగ్గుతుంది
10. నోటి దుర్వాసన
11. పయోరియా
12. సౌందర్యానికి
13. లివర్ సమస్యలకు ( ఆచార్య బాలకృష్ణ గారు )
14. ఆర్తరైటిస్ ( ఆచార్య బాలకృష్ణ గారు )
15. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
16. వాపులను తగ్గిస్తుంది
17. ఎనీమియాను పోగొడుతుంది ( రక్త హీనత )
18. మహిళల నెలసరి సమస్యలను పోగొడుతుంది
19. పైల్స్ నుండి రక్తం కారుతూ ఉంటె అలూవీరా జెల్ లో గేరూ కలిపి లోపలి తీసుకుంటూ , బయట లంగోటీ లో ( డ్రాయరు లాంటిది ) ఆ మిశ్రమాన్ని వేసి కట్టుకుంటే మీకు ఉపశమనం కలుగుతుంది
20. ఫెట్టీ లివర్ , స్ప్లీన్ లను తగ్గిస్తుంది
21. కేన్సర్ నివారకం ,
22. కడుపు నొప్పి

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com