కలవరం

సంచలన దర్శకుడు రాజకుమార్‌ హిరాణీ ప్రస్తుతం సంజయదత్‌ బయోపిక్‌ నిర్మాణ సన్నాహాలలో బిజీగా ఉన్నాడు. రణబీర్‌కపూర్‌ సంజయదత్‌ పాత్రను పోషిస్తుండగా అతని తండ్రి సునీల్‌ దత్‌ పాత్రను పరేష్‌ రావల్‌ పోషిస్తున్నాడు. రాజకుమార్‌ హిరాణీ ఈ నిజజీవిత కథను ఆదర్శవంతంగాను, సహజత్వానికి దగ్గరగాను ఉండేలా స్క్రిప్టు తయారు చేసుకున్నాడు. సంజయదత్‌ సమ్మతి లభించాకే సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ నిజజీవిత కథ అందాల తార మాధురీ దీక్షిత్‌కు పంటిలో రాయిలా మింగుడు పడటం లేదు. కారణం ఈ బయోపిక్‌లో ఆమె పాత్రకు కూడా స్థానం కల్పించడమే. 90 దశకంలో సాజన్‌ సినిమాలో నటిస్తుండగా సంజయ దత్‌-మాధురీ దీక్షిత్‌ల మధ్య ప్రేమకథ నడిచింది. అప్పటికే సంజయ్‌కు రిచాశర్మతో పెళ్లయింది. ఒకానొక సందర్భంలో ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే అనూహ్యంగా అక్రమ ఆయుధాల కేసులో సంజయదత్‌ జైలుకు వెళ్లాల్సి రావడంతో మాధురీ దీక్షిత్‌ సంజయ్‌కు దూరం జరిగింది. తరవాత లాస్‌ ఏంజెలెస్‌లో హృద్రోగ నిపుణుడు డాక్టరు శ్రీరాం మాధవ్‌ను వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఐదేళ్ల క్రితమే మాధురి మరలా తన మకాంను ముంబైకి మార్చింది. ఇప్పుడు సంజయ్‌ బయోపిక్‌లో మాధురి ప్రేమాయణం గురించి ప్రస్తావించక తప్పట్లేదు. అందుకే మాధురి సంజయదత్‌ను కలిసి తన పాత్ర ప్రస్తావన రాకుండా చేయమని అర్ధిస్తోందట. అయితే సంజయదత్‌ మాత్రం హామీ ఇవ్వలేదు. మరి రాజకుమార్‌ హిరాణి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. మాధురి నాలుగు సార్లు ఫిలింఫేర్‌ వారి ఉత్తమనటి పురస్కారం అందుకోవడమే కాకుండా పద్నాలుగు సార్లు ఫిలింపేర్‌ అవార్డుకు నామినేట్‌ అయింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com