కసితీరా పగ తీర్చుకోవడం అంటే ఇదే

‘మా ప్రజల కోసం..’ ‘పారిస్‌ కోసం..’ అంటూ బాంబులపై నినాదాలు రాసి మరీ ఐఎస్‌ఐఎస్‌ స్థావరాలపై రష్యా దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల రష్యా విమానాన్ని ఈజిప్టులోని సినాయ్‌ వద్ద ఉగ్రవాదులు పేల్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఈ సందర్భంగా రష్యా టెలివిజన్‌ ఒక వీడియోను ప్రసారం చేసింది. దీనిలో విమానాలకు అమర్చే బాంబులపై నలుపు సిరాతో ‘మా ప్రజల కోసం’ ‘పారిస్‌ కోసం’నినాదాలు రాసి ఉండటాన్ని చూపింది. ఈ నినాదాలను ఎయిర్‌ మెయిల్‌ ద్వారా సిరియాలోని ఉగ్రవాదులకు పంపుతున్నట్లు రష్యా రక్షణశాఖ ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది. వచ్చే వారం రష్యా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు మాస్కోలోని క్రెమ్లిన్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ కథనం వెలువడటం గమనార్హం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com