కాంతుల నడుమ “టాకో” దీపావళి వేడుకలు


తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో ఆధ్వర్యం లో దీపావళి వేడుకలు హిలియార్డ్ డేవిడ్‌సన్ హై స్కూల్ ఆవరణలో, నవంబర్ 21వ తేదీన అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఒహాయో స్టేట్ రిప్రెసెంటేటివ్ శ్రీ నీరజ్ అంతానీ, సోషల్ సర్విస్ ఆక్టివిస్ట్ శ్రీ నిర్మల్ సిన్హా మరియు ఫ్.ఐ.ఎ ప్రెసిడెంట్ నీల్ పటేల్ ముఖ్య ఆతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలకు సుమారు 1200 మందికి పైన తెలుగు ప్రజలు విచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఒహాయో నలుమూలల నుండి విచ్చేసిన పిల్లలు మరియు పెద్దలు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సంగీతం, పిల్లలు పాడిన సినిమా పాటలు, ప్రముఖ టాలీవూడ్ పాటలకి చేసిన నృత్యాలు, నాటకాలు మరియు అమర్ గారు చేసిన మిమిక్రీ వేడుకలకు వచ్చిన వారిని కట్టిపడేశాయి. పిల్లలు మరియు పెద్దలు ప్రత్యేక కట్టుబొట్టుతో చేసిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా టాకొ మరియు తానా సంయుక్తంగా నిర్వహించిన బోన్ మ్యారో డ్రైవ్ లో 50 మందికి పైగా దాతలు తమ వివరాలు నమోదు చేయించి తమ సేవాబావాన్ని చాటుకున్నారు. చివరగా చెవులూరిన్చె రుచికరమైన భోజనం అందరినీ ఆహ్లాదపరిచింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకు, వాలంటియర్స్ మరియు టాకొ కార్యవర్గ సంఘ సభ్యులు అశోకకామినెనీ, వంశీ నామాల, జైశ్రీ పోలిన, సరిత రావిపాటి, నరేన్ గడీపర్తి, ప్రసాద్ కండ్రూ, నరసింహ ఇప్పెలా, సుధీర్ కొప్పరం, ప్రవీణ్ కుమార్ అంకం, సుజాయ్ రెడ్డి, శిరిన్ బెల్లన, సతీశ్ కుర్ర, శ్రీని యలవర్తి, తన్వీ వట్టి, సురజ్ కొప్పరం, ప్రశాంత్ పుచ్చకట్ల, గణేశ్ ఎలుగురిలకు టాకొ అధ్యక్షులు రవి సామినేని కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.



More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com