కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు

అమెరికాలోని కాన్సస్‌ నగరంలో తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సస్‌ సిటి (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 800 మంది తెలుగువారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రామ్‌ కమిటీ ఛైర్‌గా విశేషు రేపల్లె వ్యాఖ్యాతలుగా శ్రావణి మేక, దీప్తి జొన్నలగడ్డ వ్యవహరించారు. ప్రార్థన గీతం, పంచాంగ శ్రవణంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి.చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, గీతాలాపన, నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. టీఏజీకేసీ అధ్యక్షుడు సురేష్‌ గుండు తన కార్యవర్గ సభ్యులను పాటల ద్వారా ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి చేరువయ్యేలా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. టీఏజీకేసీ ట్రస్టు బోర్డు ఛైర్‌ శిరీష మంచెల్ల బోర్డు కార్యవర్గాన్ని అతిథులకు పరిచయం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సంఘానికి సేవలు చేస్తోన్న వారికి ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేశారు. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన ముగ్గులు, చెస్‌, క్యారం బోర్డు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల నిర్వహణకు సహకరించిన అందరికీ టీఏజీకేసీ ఉపాధ్యక్షుడు శివ తియాగుర ధన్యవాదాలు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com