కామసూత్రానికి ప్రేరణ ఆలా వచ్చింది

దాదాపు రెండు వేల సంవత్సరాలుకు ముందు వాత్స్యాయన మునీచే రూపొందించబడిన కామ శాస్త్రం అత్యంత ప్రామాణిక పరిపూర్ణ గ్రంధంగా ఆవిర్భవించింది. అంతకు పూర్వమే కొంత మంది కామ శాస్త్ర రచనలు కావించినా అవన్నీ అతిక్లిష్టమై, అర్ధం కాని రీతిలోనో .. లేక అసంపూర్ణంగానో ఉన్నవే. వాటిని బాగా పరిశీలించి, పరిశోధించి అప్పటి కాలమాన పరిస్థితులు మానవ తత్వాలును బట్టి వాత్స్యాయన ముని కామ శాస్త్రానికి ఒక ఆకృతి పరిపూర్ణత తీసుకురావడం జరిగింది కాబట్టి ‘వాత్స్యాయన కామ సూత్రా’ పేరిట ప్రప్రధమ కామ శాస్త్రం వెలుగులోనికి వచ్చింది. ‘వాత్స్యాయన కామసూత్రాలు’ మొదట్లో కొంత మంది విమర్శలకు లోనైనా ఆ తరువాత అందులోని సారాంశాన్ని సునిశీటంగా గుర్తించిన ఎందరో పండితుల ప్రశంశాలనూ రాజుల ఆదరణను పొంది ప్రపంచ మేధావులను సైతం ఆకర్షించింది. భారతదేశం లో ‘వాత్స్యాయన కామ సూత్రాలు’ గ్రంధంగా పుట్టి తరువాత ఆంగ్లంలోకి అనువదించబడి ఆ తరువాత ఇంగ్లీషు నుండి దాదాపు ప్రపంచంలో అన్ని భాషల్లోకి అనుదింపబడి బహుళ ప్రజాదరణ పొందింది. ‘వాత్స్యాయన కామ సూత్రాలు’ వెలుగులోనికి వచ్చిన తరువాతనే అందులో నుండే మనవ తత్వాలు రతి రహస్యాలు లైంగిక పరిశోధనలకు మార్గదర్శిగా నిలిచాయి. అప్పటి నుండీ ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన లైంగిక విజ్ఞానానికి మూల నిధి ‘వాత్స్యాయన కామ సూత్రాలు”.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com