కాలిఫోర్నియాలో చినజీయర్ ప్రవచనం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియ్యర్‌ స్వామి ప్రవచనం శాక్రమెంటో తెలుగు సంఘం (టాఘ్శ్) ఆధ్వర్వంలో మంగళవారం జనవరి 10న ఫోల్సం నగరంలో విస్టా డీలాగో హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. పెద్దసంఖ్యలో స్థానిక ప్రవాసులు హాజరయిన ఈ కార్యక్రమంలో జియ్యర్‌ స్వామికి టాఘ్శ్ చైర్మన్ వెంకట్ నాగం పూర్ణకుంభంతో సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. దేహాన్ని దేవాలయంగా భావించి నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని జియ్యర్‌ స్వామి తన ప్రవచనం లో చెప్పారు. ‘ప్రజ్ఞ‘ని స్థాపించి వేలాది మంది పిల్లలందరికీ శ్లోకాలు, భారత, రామాయణం కథలు, వేదాలు నేర్పించడం జరుగుతున్నదని, ఉచ్ఛారణలో తప్పులు లేకుండా శ్రద్ధగా నేర్చుకొంటే వాటి ఫలితం పూర్తిగా పొందవచ్చునని పేర్కొన్నారు. అతి సామాన్యుడికి సైతం ఆలయ ప్రవేశం కలిగేలా చేసి సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆరాధనా విధానాన్ని క్రమబద్దీకరించి నిత్యం లక్షలాది భక్తులు ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకునేలా చేసిన సమతామూర్తి శ్రీ రామానుజచార్య ప్రాభవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు రూ.600 కోట్ల రూపాయలతో శ్రీమద్రామానుజ స్ఫూర్తి కేంద్రం హైదరాబాద్ లోని శంషాబాద్ లో నిర్మించనున్నట్లు చిన్నజియ్యర్ తెలిపారు. ఈ కేంద్రంలో 45 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగులు ఎత్తున శ్రీ రామానుజస్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ‘స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ పేరుతో ఇంత భారీఎత్తున నిర్మించే ఆ ‘సమతామూర్తి’ విగ్రహం ఏర్పాటుకే కనీసం నూరుకోట్ల రూపాయల దాకా వ్యయమవుతుందని, ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల దాకా వ్యయమవుతాయని ఆయన వెల్లడించారు. మూడు దశల్లో జరిగే ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని చిన్నజియ్యర్‌ తెలిపారు. దీనితో పాటు బెజవాడలోని విజయకీలాద్రి పర్వతంపై 108 అడుగుల రామానుజల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రవచన కార్యక్రమ విజయవంతానికి TAGS కార్యవర్గ సభ్యులు: మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి, నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, శ్రీధర్ రెడ్డి, వెంకట్ నాగం, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల తదితరులు, మరియు కార్యకర్తలు: వేణు ఆచార్య,శాంత, అనుదీప్ గుడిపెల్లి, రామ కృష్ణ నీలం, సత్యవీర్ సురభి,శ్రీ, రాకేష్ గుర్రాల, ఉష మందడి, వాణి నాగం తదితరులు తోడ్పడ్డారు. శనివారం జనవరి 14 వ తేదిన సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం, తదుపరి 1:30 గంటలకు సంక్రాంతి సంబరాలు మొదలు అవుతాయని, ఈ వేడుకలకు పెద్ద ఎత్తున హాజరై సహకరించాలని కార్యవర్గ సభ్యులు ఆహుతులకు విన్నవించారు. టాఘ్శ్ సంక్రాంతి సంబరాల కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసు కోవాలనుకునే వారు http://www.sactelugu.org లేదా https://www.facebook.com/SacTeluguను సందర్శించాలని లేదా sactags@gmail.comకు ఈమెయిలు లో సంప్రదించాలని కోరారు.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com