కాలిఫోర్నియాలో శతచండీ యజ్ఞం

వచ్చే నెల 1 నుంచి 11 వరకు అమెరికాలో శతచండీ యజ్ఞం నిర్వహించనున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లివర్‌మోర్‌లోని శివవిష్ణు ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు అతిరుద్ర, అలాగే మార్చి 1 నుంచి 10 వరకు శతచండీ యజ్ఞాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ మహత్తర యజ్ఞాల్లో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శతచండీ యాగం చివరి రోజున శివపార్వతుల కల్యాణం, అతిరుద్ర ముగింపు సందర్భంగా నంది వాహన సేవతో ఈ వేడుకలు ముగుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com