కాలిఫోర్నియా-అట్లాంటాల్లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సులు


తెలుగు జాతి సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్‌ మహేష్‌ బీగాల కోరారు. హైదరాబాద్‌లో డిసెంబర్‌ 15 నుంచి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహించారు. ఈ సదస్సుకు మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్‌ బీగాల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచమంతా పర్యటిస్తూ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు తెలుగుజాతి రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఏసీ, టీఆర్‌ఎస్‌, యూఎస్‌ఏ, సిలికానాంధ్ర, బీఏటీఏ, వీటీఏ, టీడీఎఫ్‌, టీఏటీఏ తదితర సంఘాల ప్రతినిధులు, తెలుగు రచయితలు, కళాకారులు పాల్గొన్నారు. అట్లాంటా కార్యక్రమంలో మహెష్ బిగాల మాట్లాదుతూ కేసీఆర్‌కు తెలుగుపై ఉన్న మమకారం గురించి వివరించారు. తెలుగు భాషను, పండితులను గౌరవించుకోవల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రముఖ సంస్కృతాంధ్రపండితులు బాబు దేవీదాస్ శర్మ, సురేష్ కొలిచాల, ఫణి డొక్కా తదితరులు ప్రసంగించారు.
tnilive.com tnilive telangana 2017 telugu conference

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com