కీలక అనుమతులు దక్కించుకున్న రెడ్డీస్

నాడీ కణాల రుగ్మత హంటింగ్‌టన్స్‌ చికిత్సకు వినియోగించే ఔషధాన్ని అమెరికా విపణిలోకి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ విడుదల చేసింది. ‘టెట్రాబెనాజైన్‌’ జనరిక్‌ ఔషధం బిళ్లలను విక్రయించడానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థ (యూఎస్‌ఎప్‌డీఏ) నుంచి అనుమతి లభించిందని, ఇందుకు అనుగుణంగా బిళ్లలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టామని కంపెనీ వెల్లడించింది. వాలియన్‌ ఫార్మాస్యూటికల్స్‌ లగ్జెంబర్గ్‌ ఎస్‌ఏఆర్‌ఎల్‌ కంపెనీ, ‘జినాజైన్‌’ బ్రాండ్‌తో ఈ ఔషధాన్ని విక్రయిస్తుంది. దీనికి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఔషధం జనరిక్‌. 2017, నవంబరుతో ముగిసిన 12 నెలలకు జినాజైన్‌, దాని జనరిక్‌ ఔషధాల విక్రయాలు అమెరికాలో 32.2 కోట్ల డాలర్లు ఉన్నట్లు అంచనా.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com