కుంబ్లేపై ఆగ్రహం

స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల్లో పడి కొట్టుమిట్టాడుతున్న టీమిండియాకు ఒక దశా, దిశా నిర్దేశించిన సారథి సౌరవ్‌ గంగూలీ. త్వరలో ఆయన స్వీయ చరిత్ర ‘ఎ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’ పుస్తకం విడుదల కాబోతోంది. ఎన్నో ఆసక్తికర సంగతులను దాదా అందులో పంచుకున్నారు. గ్రెగ్‌ చాపెల్‌ వివాదం మొదలుకొని టీమిండియాలో పునరాగమనం చేసేంత వరకు పడ్డ కష్టాలను వివరించారు. పుస్తకంలోని ఒక భాగాన్ని ప్రచురణ సంస్థ జగ్గర్‌నట్‌ బుక్స్‌ తన వెబ్‌సైట్‌లో ఉచితంగా ఉంచింది. అందులోని కొన్ని అంశాలు…..గ్రెగ్‌ చాపెల్‌ వివాదం తర్వాత గంగూలీ జట్టు పగ్గాలు వదిలేయాల్సి వచ్చింది. జట్టులో స్థానమూ కోల్పోయాడు. వీడ్కోలు నిర్ణయం ప్రకటించిన కొన్ని నెలల ముందు 2008 ఇరానీ ట్రోఫీకి రెస్టాఫ్‌ ఇండియాలో తనను ఎంపిక చేయకపోవడం దాదాకు చాలా కోపం తెప్పించింది. సెలక్టర్లు తన గురించి ఏమనుకుంటున్నారో ఆయనకు స్పష్టంగా తెలిసింది. అసలు తనను ఎందుకు ఎంపిక చేయలేదని అప్పటి సారథి అనిల్‌ కుంబ్లేను కడిగిపారేయాలని గంగూలీ నిర్ణయించుకున్నాడట. ‘నన్ను నీ జట్టులోకి ఎంపిక చేసుకోవా? అని అతడిని ముఖం మీదే అడిగేశా. దానికి జెంటిల్మన్‌ అయిన కుంబ్లే చాలా ఇబ్బంది పడినట్టున్నాడు. జట్టు ఎంపిక చేసేముందు దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ తనను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుందని నాతో చెప్పాడు. అయితే నీ జట్టుకు నా సేవలు అవసరమని నువ్వు విశ్వసిస్తున్నావా అని మళ్లీ అడిగా. అందుకు అతడు ఇచ్చిన సమాధానం నాకు ఓదార్పునిచ్చింది. ఎంపికలో అంతిమ నిర్ణయం తనదైనప్పుడు రాబోయే టెస్టు మ్యాచ్‌కు తప్పక ఎంపిక చేస్తా అన్నాడు. దాంతో నాకెంతో ఉపశమనం కలిగింది’ అని గంగూలీ అన్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com