కుమార్తె కష్టాలు

సీనియర్‌ నటి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌కు కష్టపడే తత్వం చాలా ఉందని దర్శకుడు శశాంక్‌ ఖైతాన్‌ అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ధడక్‌’. ఈ చిత్రంతో జాన్వి వెండితెరకు కథానాయికగా పరిచయం కాబోతున్నారు. ఇషాన్‌ ఖత్తర్‌ ఈ చిత్రంలో కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.అయితే ఈ సినిమా కోసం జాన్వి, ఇషాన్‌లతో కలిసి పనిచేయడం గురించి శశాంక్‌ ఓ పత్రికతో పంచుకున్నారు. ‘సినిమా ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వీరి(జాన్వి, ఇషాన్‌)తో కలిసి పనిచేస్తున్నా. ఇద్దరు చాలా గొప్పవారు, కష్టపడే తత్వం ఉన్నవారు. నటీనటుల్లో నేను కోరుకునేది ఈ రెండు లక్షణాలనే’ అని ఆయన చెప్పారు.మరాఠీలో అద్భుత విజయం సాధించిన చిత్రం ‘సైరాత్‌’. రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి హిందీ రీమేక్‌ ‘ధడక్‌’ రూపొందుతోంది. ధర్మా ప్రొడక్షన్స్‌, జీ స్టూడియో సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జులై 6న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com