కువైట్ కార్మికులకు కాంగ్రెస్ అభయహస్తం

కువైట్‌ ప్రకటించిన క్షమాభిక్ష పథకంలో తిరిగి రావాలనుకుని ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు కాంగ్రెస్‌ మద్దతుగా నిలిచింది. వీరికి భరోసా ఇచ్చేందుకు ఏఐసీసీ, ఐఎన్‌టీయూసీ, టీపీసీసీ గల్ఫ్‌ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందం ఈనెల 14 నుంచి 17 వరకు కువైట్‌లో పర్యటించనుంది. ఈ బృందానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు కుంతియా నాయకత్వం వహించనున్నారు. దాదాపు 30 వేల మంది భారతీయ కార్మికులు కువైట్‌ నుంచి స్వదేశానికి వచ్చేందుకు ప్రయాణ ఛార్జీలు లేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారని.. వారిలో తెలంగాణకు చెందిన వారు 5 వేల మంది వరకు ఉంటారని టీపీసీసీ గల్ఫ్‌ ఎన్నారై విభాగం కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు వాట్సాప్‌ నెంబరు 90000 95360కు సంప్రదించాలని సూచించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com