కూచిపూడిలో చురుగ్గా సాగుతున్న సిలికానాంధ్ర ‘సంజీవని’ పనులు


తూర్పు కృష్ణా పరిధిలోని రోగులకు ఆధునిక వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన వైద్యశాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. అమరావతి పరిధిలోని కూచిపూడి నాట్యారామంలో నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని వైద్యశాలను సిలికానాంధ్ర ఆధ్వర్యంలో రూ.35కోట్ల అంచనాల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభించారు.
**ఇప్పటికే దాదాపు రూ ఎనిమిది కోట్ల విలువైన పనులు జరిగాయి. 35 వేల అడుగుల విస్తీర్ణంలో సెల్లార్ నిర్మాణం, గ్రౌండ్ ఫ్లోర్ పాతిక వేల చదరపు అడుగులతో త్వరలో శ్లాబు వేయనున్నాను. ఈనెల 30న శ్లాబు పనులు పూర్తీ చేయనున్నారు.
**సిలికానాంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ ఆధ్వర్యంలో సిలికానాంధ్ర కుటుంబ సభ్యుల సహకారంతో పాటుగా స్థానిక గ్రామాల ప్రజల సాయంతో ఈ సంజీవని పనులు చేస్తున్నారు.
**మచిలీపట్నం, పామర్రు, గూడూరు, అవనిగడ్డ, చల్లపల్లి, పమిడిముక్కల, ఘంటసాల మండలాలతో పాటు పలు మండలాల ప్రజలు ఈ వైద్యశాలను ఉపయోగించుకునేలా 200పడకలు ఏర్పాటు చేయనున్నారు. చుట్టుపక్కల పది మండలాలలోని 156 గ్రామాల్లోని ఐదు లక్షల మందికి ఆధునాతన వైద్యసేవలను అందించనున్నారు.
*కూచిపూడి వంటి గ్రామ ప్రాంతంలో ఎటువంటి ఆధునిక నిర్మాణ సాంకేతిక సౌకర్యాలు లేకపోయినా వాటిని ఇక్కడకు తీసుకువచ్చి పనులు చేస్తున్నారు. వచ్చే ఏడాది విజయదశమి నాటికి నిర్మాణం పూర్తీ చేయాలనే సంకల్పంలో కమిటీ వారు ఉన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో అత్యవసర సమయంలో విజయవాడ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్ళే అవస్థలు తప్పనున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com