కృష్ణా జిల్లా అభివృద్ధికి ప్రవాసుల తోడ్పాటుపై కలెక్టర్ హర్షం


కృష్ణా జిల్లా అభివృద్ధికి ప్రవాసాంధ్రులు చేపడుతున్న కార్యక్రమాలపై కలెక్టర్ బి.లక్ష్మీ కాంతం హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ప్రవాసాంధ్రులతో రెండు గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ప్రెసెంటషన్ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో 108 మంది ఎన్నారైలతో పాటు ఉత్తర అమెరికాలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం కాలిఫోర్నియా నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 200 పాఠశాలలు పూర్తిగా డిజిటల్ పాఠశాలలుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఏపీ జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ప్రవాసాంధ్రులు, వారి బంధువులు విరివిగా అందించిన విరాళాలు మరియు ప్రభుత్వ తోడ్పాటుతో దీన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.ఈ విషయంలో జిల్లా ఇప్పటికే ప్రథమ స్థానంలో నిలిచిందని అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం చేయడానికి సహకరించిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి కోమటి జయరామ్ కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు ముందు జరగబోయే కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించి, తగు తోడ్పాటు అందించాలని ఆయన కలెక్టర్ను కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా మరో 232 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటిల్ తరగతులు ఏర్పాటు చేయబోతున్నట్లు , అందుకు కావాల్సిన నిధులను సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు. జూన్ 12న వీటి ప్రారంభోత్సవం వేడుకగా జరపాలని కలెక్టర్ సూచించారు. విరాళాలు అందజేసిన ప్రవాసాంధ్రులు మరియు వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరిస్తామని తెలిపారు. కృష్ణా జిల్లాలో చిన్నారుల్లో పోషకాహార లోపం, గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సున్నా స్థాయికి తీసుకుని రావాలని మేము సైతం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సహకరించాలని ప్రవాసాంధ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధికి కలెక్టర్ చేస్తున్న కృషి పట్ల ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేశారు.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com