కెనడాలో తెలంగాణ ధూంధాం


తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association–TCA) ఆధ్వర్యంలో శనివారం నాడు మిస్సిస్సౌగలోని పోర్టుక్రెడిట్ సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్బావాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యదర్శి రాధిక బెజ్జంకి ఆహ్వానం పలికారు. అధ్యక్షులు కోటేశ్వరరావు చిత్తలూరి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. ఫౌండేషన్ కమిటి అధ్యక్షులు దేవేందర్ రెడ్ది గుజ్జుల అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సభకు విచ్చేసిన వారందరితో మౌనం పాటింపజేసిన అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా కెనడాలో భారత ప్రభుత్వ సహాయ రాయబారి, తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా అధ్యక్షులు శ్రీధర్ భండారు హాజరయి నూతన తెలంగాణ నిర్మాణంలో కెనడా తెలంగాణ ప్రవాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కెనడా సంఘం వ్యవస్థాపకుడు రమేశ్ మునుకుంట్ల-ధనలక్ష్మీ మునుకుంట్ల దంపతులను సంస్థ కార్యవర్గం సన్మానించింది. సాంస్కృతిక కార్యదర్శి తిరుమలాపురం విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గిరిధర్ క్రొవిడి లష్కర్ బోనాల ఊరేగింపు, పీరీల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ట్రస్టు బోర్డు అధ్యక్షులు ప్రభాకర్ కంభాలపల్లి, ఉపాధ్యక్షులు రాజేశ్వర్ ఈద, కోశాధికారి సంతోష్ గజవాడ, డైరక్టర్లు శ్రీనివాస్ మన్నెం, దామోదర్ రెడ్ది మాది, మురళి కాందివనం, భారతి కైరోజు, మల్లికార్జున్ మదపు, ట్రుస్టీలు సమ్మయ్య వాసం, శ్రీనివాస్ తిరునగరి, వ్యవస్థపక సభ్యులు చంద్ర స్వర్గం, నవీన్ రెడ్ది సూదిరెడ్ది, హరి రావుల,అఖిలేశ్ బెజ్జంకి, వేణు రోకండ్ల, వ్యాఖ్యాతలు స్నిగ్ద గుల్లపల్లి, మనస్విణి బెజ్జంకి, ఐశ్వర్య ఈద, మేఘ స్వర్గం తదితరులు పాల్గొన్నారు



More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com