కెనడాలో దీపావళి కాంతులు


తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) వారి ఆద్వర్యంలో నవంబర్ 21వ తేది 2015 శనివారం రోజున మిస్సిస్సాగ నగరంలోని చిన్గోస్కి సెకండరి స్కూల్లోని ఆడిటోరియంలో సుమారు 800 పైగా తెలుగు వారు పాల్గొనగా దీపావళి ఉత్సవాలు మరియు తాకా 5వ వసంత వేడుకలు అత్యంత వైభవంగాజరుపుకున్నారు. ఈ వేడుక అచ్చ తెలుగు సాంప్రదాయ పద్దతులతో దాదాపు 6 గంటలపాటు వివిద సాంస్క్రుతిక కార్యక్రమాలతొ సభికులను అలరించాయి. ఈ స౦దర్బ౦లో 30 కి పైగా చక్కటి సా౦స్క్రుతిక కార్యక్రమాలు తాకా ఆద్వర్య౦లో జరుగగా ఇ౦దులో కెనడా లోకల్ తెలుగు కళాకారులు పాల్గొన్నారు. తాకా వారు చక్కటి రుచికరమైన తెలుగు భోజన౦ ఏర్పాటు చేశారు. తాకా అధ్యక్షులు మునాఫ్ అబ్దుల్ సభికులను ఆహ్వానించగా జ్యోతి ప్రజ్వలనతొ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాంస్కృతిక కార్యమలన్నింటిని శ్రీ అరుణ్ కుమార్ లయం గారు పర్యవేక్షనలో నిర్వహించబడినాయి. తాకా ట్రస్టు చైర్మన్ రామచంద్రరావు దుగ్గిన మరియు ఫౌండేషన్ కమీటీ చైర్మన్ అరున్ కుమార్ లయం దీపావళి ప౦డుగ ప్రాశస్త్యాన్ని, తాకా చేస్తున్నవివిధ కార్యక్రమాలను వివరి౦చారు, తెలుగు వార౦దరిని తాకా సభ్యత్వాన్నితీసుకోవలసినదిగా కోరారు. సభ్యులకు కలుగు లాభాలను వివరి౦చారు, తెలుగు స౦స్కృతి, సా౦ప్రదాయలను కొనసాగిస్తు కెనడా లోని ము౦దుతరాల వారు మరచిపోకు౦డా అ౦ది౦చుటకు సహకరి౦చవలసినదిగా కోరారు.ఈ కార్యక్రమము లో ఉపాధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి, కొశాధికారి లొకెష్ చిల్లకూరు, డైరక్టర్లు శ్రీవాణి మూసాపేట, వెంకట్ నందిపాటి, భానుప్రకాష్ పొతకమూరి, ట్రస్టీలు వైశాలి, ప్రసాద్ ఓడూరి, మరియు మాజి అధ్యక్షులుగంగాధర్ సుఖవాసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న చిన్నారులందరికి బహుమతి ప్రదాన౦ చేశారు, చివరగా వ౦దన సమర్పణతో ఉత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో తాకా జనరల్ సెక్రెటరి శ్రీ రమెష్ మునుకుంట్ల గారు ఈ క్రింది నూతన కార్యవర్గాలను (2015-2017) సభకు పరిచయము చేసారు.
Executive Committee
అధ్యక్షులు: చారి సామంతపూడి
ఉపాధ్యక్షులు: బాచిన శ్రీనివాస రావు
జనరల్ సెక్రటరీ: లోకేష్ చిలకూరు
కోశాధికారి: భానుప్రకాష్ పోతకమురి
డైరెక్టర్: దీపా సాయిరామ్
డైరెక్టర్: కల్పనా మోటూరి
డైరెక్టర్: నాగేంద్ర హంసాల
యూత్ డైరెక్టర్: కీర్తి సుఖవాసి
యూత్ డైరెక్టర్: శ్రావణి దుగ్గిన
Board of Trustees:
ఛైర్మన్ : అరుణ్ కుమార్ లయం
ట్రస్టీ సబ్యులు : బాష షేక్
: వైశాలి శ్రీధర్
: మీనా ముల్పూరి
: వీరంజనేయులు కోట
ఫౌండర్స్ ఛైర్మన్: రమేష్ మునుకుంట్ల


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com