కెనడా వీసా అక్రమాల కేసులో హైదరాబాద్ అమ్మాయి

కెనడా పంపిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసిన ఓ యువతి మోసం ఎట్టకేలకు బట్టబయలైంది. నగరంలోని నేరేడ్‌మెట్ పోలీస్టేషన్ పరిధిలోగల రాంనగర్ లో నివాసముంటున్న హేమలత అనే యువతి దాదాపు 150 మంది తమిళనాడుకి చెందిన యువతుల దగ్గర డబ్బులు వసూలు చేసింది. కెనడా దేశానికి పంపిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రూ. 2 లక్షలు వసూలు చేసింది. అయితే… ఎంతకూ తమను కెనడా పంపించకపోవడంతో అనుమానం వచ్చిన యువతునలు బుధవారం రాంనగర్ వచ్చారు. తాము మోసానికి గురయ్యామన్న విషయాన్ని గుర్తించిన వారు నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బుధవారం నుంచి పోలీస్‌స్టేషన్ పక్కన ఉండే ఓ పార్కులో ఉంటూ వారు ఇబ్బందుల పడుతున్నారు. కాగా తాము కట్టిన డబ్బులు మాకు ఇప్పించాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com