కేంద్ర బడ్జెట్‌లో అమరావతి విశేషాలు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2018-19 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన ఈ రోజు ఉదయం లోక్‌సభలో 11 గంటలకు బడ్జెట్‌ను ప్రసాంగాన్ని మొదలుపెట్టారు. అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం ఇది ఐదోసారి. అయితే ఎన్డీయే సర్కార్‌కు ఇది పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్‌. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ కేంద్రానికి అతిముఖ్యమైనది. బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు పార్లమెంట్‌లో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా బడ్జెట్ 2018-19కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్‌లోని ప్రధాన అంశాలు….

* నాలుగేళ్ల కిందట పారదర్శకత పాలన అందిస్తామని చెప్పాం.
* మేం అధికారంలోకి వచ్చే నాటికి విధానపరమైన పక్షపాతం ఉంది.
* మోదీ నేతృత్వంలో వ్యవస్థీకృత సంస్కరణలు అమలవుతున్నాయి.
* ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌.
* జీఎస్టీతో పేదలకు మేలు జరిగింది.
* పేద, మధ్యతరగతిలపై వైద్యపరమైన భారం పడకుండా చూసాం.
* సెంట్ల ధరలు తగ్గించాం.
* నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేశాం.
* రాజకీయాలకు అతీతంగా సంస్కరణలు చేపట్టాం.
* వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది.
* ఈ బడ్జెట్‌లో వ్యవసాయంతోపాటు సంక్షేమ రంగంపై దృష్టి సారించింది.
* మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది.
* రైతుల ఆదాయం పెంచేందుకు దృష్టి సారించాం.
* భారత్‌ 7శాతం వృద్ధిని సాధిస్తుందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది.
* 2020 నాటికి రైతులను ధనికులుగా చేస్తాం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com