కేరళలో కథువా బాలికపై వికృత వ్యాఖ్యలు

అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై మృగాళ్ల మారణకాండ యావత్ దేశాన్ని చలింపజేసింది. ఆ పసిప్రాయాన్ని మొగ్గలోనే తుంచేసిన ఆ కిరాతకులకు తగిన శి‌క్ష వేయాలంటూ డిమాండ్‌ చేస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా బాలిక అత్యాచార, హత్య ఘటనపై ఓ వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బాధితురాలిని అవమానిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు చేశారు. కేరళకు చెందిన విష్ణు నందకుమార్‌ ఓ ప్రయివేటు బ్యాంకు ఉద్యోగి. కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ కోచి బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. ఇటీవల వెలుగుచూసిన కథువా ఘటనపై విష్ణు తన సోషల్‌మీడియా ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ అమ్మాయి ఈ వయసులోనే హత్యకు గురవడం మంచిదైంది. లేదంటే ఆమె పెరిగి పెద్దయి భారత్‌ మీదకు బాంబులు విసిరేది’ అంటూ వ్యాఖ్యానించాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com