కేవలం నీటి వలన బరువు తగ్గలేరు. తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయి.

ఇప్పుడిప్పుడే ప్రచారమవుతున్న సందేశం ఇది. రెండు మూడు వారాల పాటు ఆహారం పూర్తిగా మానేసి, కేవలం నీళ్లు మాత్రమే తాగటం ద్వారా బరువు తగ్గుతుందనేది దీని సారాంశం. అయితే ఆహారమేమీ తీసుకోకుండా కేవలం నీళ్లు తాగటం వల్ల స్వల్పకాలంలోనే కాదు, దీర్ఘకాలంలోనూ దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. ఆహారం తినకపోవటం వల్ల అవసరమైన పోషకాలు అందవు. దీంతో శరీర వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమవుతాయి. రక్తంలో గ్లూకోజు స్థాయులు బాగా పడిపోవటం వల్ల విపరీత పరిణామాలకు దారితీయొచ్చు. అసలే తిండి తినకపోవటం వల్ల శరీరం షాక్‌కు గురై కొంతసేపు గ్లూకోజు స్థాయులు పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఒంట్లో నీటి మోతాదు పెరగటం వల్ల కణాలు, మెదడు కూడా ఉబ్బిపోయే అవకాశముంది. మరోవైపు- ఆకలితో మాడటం వల్ల శరీరం పస్తులున్నప్పటి స్థితిలోకీ వెళ్లిపోతుంది. దీంతో తిరిగి ఆహారం తీసుకోవటం ప్రారంభించాక కేలరీలను ఖర్చు చేయకుండా కొవ్వు రూపంలో దాచుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇది మున్ముందు బరువు పెరగటానికి దారితీస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com