కొండ మీద ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు-తితిదే ఈవో

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఈవో మాటల్లోనే…

⚖ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాలు : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాలు నవంబరు 15 నుంచి 23వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. నవంబరు 15న – ధ్వజారోహణం, నవంబరు 19న – గజ వాహనం, నవంబరు 20న – స్వర్ణరథం, గరుడవాహనం, నవంబరు 22న – రథోత్సవం, నవంబరు 23న – పంచమితీర్థం జరుగనున్నాయి.
⚖ అమ్మవారి బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, అన్నప్రసాదాలు, తాగునీరు తదితర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టాం.
⚖ బ్రహ్మూెత్సవాల వాహనసేవల్లో, తిరుచానూరులోని ఆస్థానమండపం, మహతి ఆడిటోరియం, శిల్పారామంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తాం.
⚖ వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు ప్రత్యేక దర్శనం : నవంబరు 14, 21వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు ఉదయం 10 గంటలకు వెయ్యి మందికి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల మందికి, మధ్యాహ్నం 3 గంటలకు మరో వెయ్యి మందికి కలుపుకుని 4 వేల మందికి దర్శన టోకెన్లు జారీ చేస్తాం.
⚖ నవంబరు 15, 22వ తేదీల్లో 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 2 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తాం. ఈ సౌకర్యాలను భక్తులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నాం.
⚖ వృద్ధులు, దివ్యాంగులకు టోకన్‌ జారీకి అదనపు కౌంటర్లు: వృద్ధులు, దివ్యాంగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో భాగంగా కొత్తగా 7 టోకెన్‌ మంజూరు కౌంటర్లు, వేచి ఉండే షెడ్‌ ఏర్పాటుచేశాం. తద్వారా వృద్ధులు, దివ్యాంగులు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశముంది.
⚖సర్వదర్శనం భక్తులకు నూతన కాంప్లెక్స్‌: సర్వదర్శనం భక్తుల కోసం నూతన కాంప్లెక్స్‌ను ప్రారంభించాం. భక్తుల కోరిక మేరకు ఇక్కడ 16 లడ్డూ టోకెన్‌ జారీ కౌంటర్లను ఏర్పాటుచేశాం.
⚖నందకంలో నూతన మినీ కల్యాణకట్ట : భక్తుల సౌకర్యార్థం నందకం విశ్రాంతి గృహంలో మినీ కల్యాణకట్టను అందుబాటులోకి తీసుకొచ్చాం. తద్వారా ఆ పరిసరాల్లోని భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అవకాశం కల్పించాం.
⚖తిరుమల హోెటళ్లలో నిర్ణీత ధరల అమలుకు చర్యలు : తిరుమలలోని హోటళ్ల యజమానులు ఆహార పదార్థాలు, పానీయాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. టిటిడి నిర్ణయించిన ధరలను అమలుచేసేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. హోటళ్లలో ధరలను విజిలెన్స్‌ అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
⚖భక్తుల ఫిర్యాదుతో క్షురకులపై చర్యలు: కల్యాణకట్టలో భక్తుల నుంచి డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి కొంతమంది మంది క్షురకులపై చర్యలు తీసుకున్నాం. ఇకపై భక్తుల నుంచి అలాంటి ఫిర్యాదులు రాకుండా కల్యాణకట్టలలో మరింత పర్యవేక్షణ చేపట్టాం. బహుశా ఇపుడు అలాంటి ఫిర్యాదులు లేవని ఆశిస్తున్నాం.
⚖టిటిడి డైరీలు, క్యాలెండర్లు: 2018వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని టిటిడి సమాచార కేంద్రాల్లో భక్తులకు అందుబాటులో ఉంచడమైనది. 
⚖ టిటిడి వెబ్‌సైట్‌ కన్నడ వర్షన్‌:  ttdsevaonline.com వెబ్‌సైట్‌ కన్నడ వర్షన్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ నెలలో తమిళ వర్షన్‌ను, వచ్చే నెలలో హిందీ వర్షన్‌ను ప్రారంభిస్తాం. 

అక్టోబరులో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 23.77 లక్షలు, లడ్డూ ప్రసాదం 95.46 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 55.19 లక్షలు, అల్పాహారం, టి, కాఫి, పాలు 31.37 లక్షలు, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11.09 లక్షలు, హుండీ ఆదాయం 83.76 కోట్లు, గదుల ఆక్యుపెన్సీ శాతం 105 శాతంగా నమోదైందని తెలిపారు. గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు 2018, మార్చి చివరి నాటికి టిటిడిలో పూర్తిస్థాయిలో ఈ-ఫైలింగ్‌ విధానాన్ని అమలుచేస్తామన్నారు. ప్రస్తుతం 5 విభాగాల్లో ఈ-ఫైలింగ్‌ అమలవుతోందని, ఈ నెలలో మరో 12 విభాగాలకు విస్తరిస్తామని తెలిపారు. తిరుమలలో మరో 4 నెలల్లో పూర్థిస్థాయిలో అధునాతన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్‌లోని భద్రతాధికారులతో సివిఎస్‌వో చర్చలు జరిపారని  చెప్పారు. ఐఐటి నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com