కొత్త ఒక వింత

టాలీవుడ్లో తాజాగా విడుదలైన ‘పెళ్ళి చూపులు’తో అందరి దృష్టిని ఆకర్షించిన భామ రీతూవర్మ. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో రీతూకు అవకాశాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆమె ఖాతాలో మరో అవకాశం వచ్చిచేరింది. అదే ‘గూడాచారి’. శశితిక్క, రాహుల్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రీతూ అవకాశం దక్కడంతో ఎగిరిగంతేసింది. ఈ చిత్రం కోసం దర్శక, నిర్మాతలు ఎందరో కథానాయికలను పరిశీలించారు. అయితే ‘పెళ్ళి చూపులు’ చిత్రంలో తన సహజనటనతో నటిగా మంచి మార్కుల్ని కొట్టేసిన రీతూను చూసిన దర్శక, నిర్మాతలు ఆమెకు ఈ అవకాశాన్ని కల్పించారు. ‘‘నేను చేసిన పాత్రకు న్యాయం చేశానా లేదా? అన్నదే నాకు కావలసింది. ‘పెళ్ళి చూపులు’లో నేను పోషించిన క్యారెక్టర్కు మంచి స్కోప్ వుంది. అందుకే ఆ పాత్ర అందరికీ నచ్చింది. ఈ పాత్ర పోషించిన నాకు సహజంగా మంచి పేరు వచ్చింది. అంతేకాదు, ఆ పాత్రే నాకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతోంది’’అంటూ ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చింది. దీంతో రీతూ కెరీర్ తాజాగా బిజీ బిజీగానే మారింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com