కొబ్బరి నీళ్లు మరిచిపోకండి

వేసవి తీవ్రమైంది. రోజూ మండిపోతున్న ఎండలకు జనాలు అల్లాడిపోతున్నారు. వేసవితాపం చల్లారేందుకు రక రకాల మార్గాలు అనుసరిస్తున్నారు. అయితే ఎండ వేడిని తట్టుకునేందుకు ఉత్తమమార్గం కొబ్బరినీళ్లు తాగడమే. వాటిని తాగితే చాలు వేసవి తాపం ఇట్టే పోతుంది. శరీరానికి కావల్సిన ద్రవాలు అందుతాయి. దాహం తీరుతుంది.. అయితే కేవలం దాహం తీర్చేందుకే కాక.. పలు ఇతర ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే గుణాలూ కొబ్బరినీళ్లకు ఉన్నాయి. వీటిని ఈ సీజన్‌లో రోజూ తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో నిపుణులు స్పష్టం చేస్తున్నారు.కొబ్బరినీళ్లలో ప్రొటీన్లు, కొవ్వు, పిండిపదార్థాలు, డైటరీ ఫైబర్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ వంటి మినరల్స్‌ ఉంటాయి. విటమిన్‌-సి, బి6, ఇ, కె, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు కొబ్బరినీళ్లలో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి వేసవిలో కావల్సిన పోషకాలను అందిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.కొబ్బరినీళ్లు ఎలక్ట్రోలైట్స్‌గా పనిచేస్తాయి. శరీరంలోని నీటి పరిమాణాన్ని సమతుల్యం చేస్తాయి. దీంతో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.గ్యాస్ట్రోఎంటరైటిస్‌, వాంతులు, నీళ్ల విరోచనాలను తగ్గించడంలో కొబ్బరినీళ్లు అమోఘంగా పనిచేస్తాయి.కొబ్బరినీళ్లలో యాంటీ ఇన్ఫెక్టివ్‌ గుణాలుండడం వల్ల పలురకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.లేత కొబ్బరిబోండాలోని నీళ్లు కలరాకు అడ్డుకట్ట వేస్తాయి. రెండు గ్లాసుల కొబ్బరినీళ్లలో.. నాలుగు టీస్పూన్ల నిమ్మరసం వేసి తాగితే ఎంతో మంచిది. ఈ మిశ్రమం తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ సమతుల్యమవుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com