కొలంబస్ ప్రవాసుల తెలంగాణ సంబురాలు

కొలంబస్ నగరానికి చెందిన కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ (CTA) ఆధ్వర్యములో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అనంతరం ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆటలు , బోనాల నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. నేతన్నలు తయారుచేసిన కాటన్ దుస్తువులతో చేసిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది. ఈ సంబరాలలో ప్రముఖ నటి ప్రగ్యా జైస్వాల్ , సింగర్ కౌసల్య , మిమిక్రి రమేష్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. CTA అధ్యక్షుడు మనోజ్ పోకల మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి లో NRI లు భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు , కళలు సాకారం కావడానికి NRIలు ముఖ్య భూమిక పోషించాలని కోరారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com