కొవ్వొత్తి వెలుగులో భోజనం జ్ఞాపకశక్తికి చేటు

ఈ రోజుల్లో చాలా మంది క్యాండిల్ లైట్ డిన్నర్లు చేస్తున్నారు. మరికొంతమంది డిమ్‌లైట్‌లో ఉండటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమంటున్నారు పరిశోధకులు. మెదడు పని తీరును ఇది ప్రభావితం చేస్తుందని.. ముఖ్యంగా నేర్చుకొనే శక్తిని నిర్వీర్యం చేస్తుందంటున్నారు. మిచిగాన్ స్టేట్ ఈ రోజుల్లో చాలా మంది క్యాండిల్ లైట్ డిన్నర్లు చేస్తున్నారు. మరికొంతమంది డిమ్‌లైట్‌లో ఉండటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమంటున్నారు పరిశోధకులు. మెదడు పని తీరును ఇది ప్రభావితం చేస్తుందని.. ముఖ్యంగా నేర్చుకొనే శక్తిని నిర్వీర్యం చేస్తుందంటున్నారు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. డిమ్ లైట్‌లో ఎక్కువగా గడపటం వల్ల… మెదడులోని హిప్పోక్యాంపస్ పనితీరులో మార్పు వస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ హిప్పోక్యాంపస్.. మెదడులో చాలా కీలకమైన విభాగం. పరిణామంలో చిన్నగా ఉన్నా.. కీలకమైన పనులు నిర్వహిస్తుంటుంది. మెదడులో భావోద్వేగాలకు కీలకమైన వ్యవస్థలో భాగంగా ఇది ఉంటుంది. జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటుంది. ముఖ్యంగా దిక్సూచిలా పని చేస్తుంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న వ్యవస్థ.. తక్కువ వెలుతురులో పని చేయడం వల్ల దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఇది తేలింది. నాలుగు వారాలపాటు.. అటు వెలుతురులోనూ.. ఇటు డిమ్ లైట్‌లోనూ ఎలుకలను ఉంచి పరిశోధనలు నిర్వహించారు. డిమ్ లైట్‌లో ఉన్నప్పుడు కంటే.. వెలుతురులో తిరిగినప్పుడే ఎక్కువగా చురుగ్గా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com