క్యాన్సర్ ఔషధాల ధరలు ౫౩శాతం తగ్గింపు

51 ప్రాణాధార ఔషధాల ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ మండలి (ఎన్‌పీపీఏ) తగ్గించింది. వీటిలో అత్యవసరమైన ఔషధాల నుంచి గుండె జబ్బులు, హెపటైటిస్‌-సి, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలూ ఉన్నాయి. ప్రస్తుతం ధరలను గరిష్ఠంగా 53శాతానికి తగ్గించారు. ఈ మేరకు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా ఎన్‌పీపీఏ తెలిపింది. 13 మందులకు గరిష్ఠ ధరను నిర్ణయించగా, 15 మందుల ధరలను సవరించారు. 23 అత్యవసర ఔషధాలను ధరలను సైతం తగ్గించినట్లు ఎన్‌పీపీఏ తెలిపింది. ఈ తగ్గుదల 6 నుంచి 53శాతం వరకూ ఉండనుంది. గరిష్ఠ ధరను నిర్ణయించిన మందుల్లో పెద్ద పేగు క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే ఆక్సాలిప్లాటిన్‌(ఇంజెక్షన్‌ 100ఎంజీ), మెదడువాపు వ్యాధి వ్యాక్సిన్‌, తట్టు, రుబెల్లా వ్యాక్సిన్‌లు ఉన్నాయి. వీటితో పాటు, అనస్థటిక్‌ సెవోఫ్లోరెన్‌, పైతోమెనడియోనీ(విటమిన్‌ కె), క్షయవ్యాధి నివారణ మెడిసన్‌ అయిన బీసీజీ వ్యాక్సిన్‌ ధరలను సవరించారు. ఔషధ చట్టం 2013 ప్రకారం ఈ ధరలను సవరించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com