క్రీడాకారుల సొమ్ముల కోసం శాప్ కక్కుర్తి

అర్జున అవార్డు సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన ప్రోత్సాహకంలో కోత విధిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రీడాకారిణిగా తన ప్రతిభను మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోటి రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వగా.. శాప్ అధికారులు అందులో రూ.15 లక్షలను కోచ్‌కు ఇచ్చేలా జీవో జారీ చేయడం దారుణమన్నారు. అధికారులు లాలూచీ పడి చెరుకూరి సత్యనారాయణకు ఆ మొత్తాన్ని కేటాయించారని ఆరోపించారు. తాను 2013 లోనే చెరుకూరి సత్యనారాయణకు చెందిన ఓల్గా ఆర్చరీ అకాడమీ నుంచి బయటకు వచ్చేశానని సురేఖ చెప్పారు. చెరుకూరి తనకు కోచ్ కాదని.. ఆయన కేవలం వార్డన్ మాత్రమేనని తెలిపారు. తనను సంప్రదించకుండా సత్యనారాయణను కోచ్‌గా శాప్ అధికారులు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. క్రీడాకారులను సీఎం ప్రోత్సహిస్తున్నా శాప్ మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో క్రీడాకారులకు సీఎం ప్రకటించిన ప్రోత్సాహకం మొత్తాన్ని యథాతథంగా అందిచేవారని.. ప్రస్తుతం శాప్‌లోని కొందరు ఉన్నతాధికారులు లాలూచీ పడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారిణిగా తనకు శాప్ నుంచి కనీస ప్రోత్సాహం లేకపోగా.. వేధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే భవిష్యత్తులో రాష్ట్రం తరపున ఎలా ఆడాలని ప్రశ్నించారు. సీఎం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని… లేని పక్షంలో సోమవారం నిరాహార దీక్షకు దిగుతామని జ్యోతి సురేఖ సహా ఆమె కుటుంబం స్పష్టం చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com