క్షమాపణలు వద్దు సోదరులారా!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ మూడు సార్లు విజేతగా నిలవడంలో కీలకంగా నిలిచిన ఇద్దరు ఆటగాళ్లు హర్భజన్‌ సింగ్‌, అంబటి రాయుడు. వీరిద్దరూ ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడటం విశేషం. రాయుడు ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడగా భజ్జీ కీలక సమయాల్లో పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఈ సారి చెన్నై విజేతగా నిలవడంతో నాలుగు సార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన జట్టులో ఉన్న ముగ్గురిలో వీరిద్దరూ ఉండటం గమనార్హం. ఈ ఆటగాళ్లకు ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్నప్పటికీ ఒకసారి మైదానంలో కలహించుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ముంబయి తరఫున ఆడుతున్న హర్భజన్‌ వేసిన బంతిని రైజింగ్‌ పుణె బ్యాట్స్‌మెన్‌ సౌరభ్‌ తివారీ ఆడగా ఫీల్డింగ్‌ చేస్తున్న రాయుడు బంతిని సరిగ్గా అందుకోలేకపోయాడు. అసంతృప్తికి గురైన భజ్జీ వెంటనే అతడిపై అరిచాడు. మీదిమీదికి వచ్చాడు. రాయుడు సైతం అదే రీతిలో స్పందించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతలోనే తమాయించుకున్న హర్భజన్‌ వెంటనే రాయుడి భుజంపై చేతులు వేసి సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ రాయుడు చేతులు విదిల్చుకొని వెళ్లిపోయాడు. ప్రస్తుతం చెన్నైకి ఆడుతున్న సందర్భంగా భజ్జీ రాయుడిని ఇంటర్వూ చేశాడు. అందులో అప్పటి సంగతులు వీరిద్దరూ గుర్తుచేసుకున్నారు. వీరి సంభాషణ సాగిందిలా..

భజ్జీ: నేనెంతో మందితో పోట్లాడాను. అందులో ఒక్కరు మాత్రమే నాకు ఎదురుతిరిగారు. అతడే రాయుడు. మైదానంలో ఇలాంటివి సహజం. అంత వరకు ఫర్వాలేదు. మైదానం బయట మాత్రం అలా ఉండకూడదు. మైదానంలో కాకపోతే ఎక్కడ జరుగుతాయి ఇవన్నీ. జట్టు అత్యత్తుమ ఫలితం కోసమే కదా ఇదంతా.
రాయుడు: అప్పుడు జరిగిన దానికి నేను మళ్లీ క్షమాపణలు తెలియజేస్తున్నా. నేనెన్నో సార్లు క్షమించాలని కోరా.
భజ్జీ: వద్దు.. వద్దు.. క్షమాపణలు వద్దు. నువ్వొక్కడివే కాదు నేనూ చాలా సార్లు సీనియర్లతో గొడవ పడ్డా. ఆ తర్వాత వెళ్లి క్షమాపణలు కోరడంతో సమస్య అక్కడితో పోయేది.
రాయుడు: అప్పుడెందుకు అలా ప్రవర్తించానో నాకే తెలియదు. ఇలా వీరిద్దరి ముఖాముఖి కొనసాగింది. ఆ వీడియో మీకోసం..

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com