క్షయ టీకాతో మధుమేహానికి అడ్డుకట్ట

క్షయ నివారణ టీకాతో మధుమేహానికి కూడా అడ్డుకట్ట వేయొచ్చునని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఎలుకల్లో మధుమేహ నియంత్రణకు ఈ టీకా అద్భుతంగా పనిచేసిందని.. త్వరలో మానవులపై కీలక ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నామని వారు వెల్లడించారు. సాధారణంగా ‘బాసిల్లస్‌ కాల్మెట్టె-గ్వెరిన్‌(బీసీజీ)’ టీకాను క్షయ నివారణకు ఉపయోగిస్తారు. మూత్రాశయ క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలోనూ వినియోగస్తుంటారు. అయితే, మధుమేహకారక టీ-కణాలను(ఒకరకం తెల్లరక్తకణాలు) నాశనం చేయగల సామర్థ్యం కూడా బీసీజీకి ఉందని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆస్పత్రి(ఎంజీహెచ్‌) పరిశోధకుల బృందం గుర్తించింది. స్వల్పస్థాయిలో ఇన్సులిన్‌ ఉత్పత్తినీ ఈ ఔషధం ప్రేరేపిస్తున్నట్లు నిర్ధారించింది. మానవులపై బీసీజీతో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతులు మంజూరు చేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com